గత రెండు రోజుల నుంచి కర్ణాటకలో రాజకీయం వాడీ వేడిగా సాగుతుంది.  బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మద్య బీజేపీ నేత యడ్యూరప్ప సీఎం ప్రమాణ స్వీకారానికి అన్నీ సిద్దమయ్యాయి.  అనుకున్నట్టుగానే నేడు ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు.ఇదిలా ఉంటే..  రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనైతిక చర్యలకు పాల్పడుతోన్న బీజేపీకి, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని సిద్ధ రామయ్య అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
Image result for yeddyurappa
అసెంబ్లీలో ఉన్నది 104 మంది సభ్యులే కాదని, 222 మంది ఉన్నారనే విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, కాంగ్రెస్ వాదనలతో ఏకీభవించని సర్వోన్నత న్యాయస్థానం, అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ఆపలేమని స్పష్టంచేసింది. అయితే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
Image result for yeddyurappa
విధానసభ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈగల్టన్‌ రిసార్ట్స్‌ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో విధానసభ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Image result for yeddyurappa
మంగళవారం నాడు వెలువడ్డ కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాషాయదళం 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: