రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠ రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో రేపు బలనిరూపణకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తమవైపు వస్తారని, వారు అక్కడ అసంతృప్తితో ఉన్నారని బీజేపీ చెబుతుండగా, అందరు ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు చెబుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపు (శనివారం) ఫ్లోర్ టెస్టు ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోను నెలకొంది.
Image result for karnataka elections
మరోవైపు, ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఎమ్మెల్యేలు సాయంత్రం లేదా శనివారం ఉదయం తిరిగి బెంగళూరు బయలుదేరుతారు. ఇదిలా ఉంటే..బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఉత్తర్వులు వెలువరించిన 5 నిమిషాల్లోనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా నిర్ణయంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Image result for karnataka elections
సంప్రదాయం ప్రకారం సీనియర్‌ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ పార్టీ నేత ఆర్‌వీ దేశ్‌పాండేను విస్మరించడం సరికాదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.  తమ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నా..గవర్నర్ ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాజ్‌పేట స్థానం నుంచి బోపయ్య గెలిచారు. 2009లోనూ ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. మరోవైపు బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ద్వారా గవర్నర్ వాజుభాయి వాలా మరోసారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని, అంతకంటే సీనియర్ ఉన్నప్పటికీ ఇలా చేయడం సరికాదని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: