అమెరికా మరోసారి నెత్తురోడింది. టెక్సాస్‌లోని శాంటా ఫె హైస్కూల్‌లో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. ఒక పోలీస్ అధికారి సహా పలువురు గాయపడ్డారు. విద్యార్థులపై ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌ లోని శాంటా హైస్కూల్‌ లో ఓ దుండగుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. 

'He Said 'Surprise,' And Started Firing': Student Kills 10 At US School

గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో శాంటా హైస్కూల్‌ లో తిరుగుతూ.. కనిపించిన వారిపై కాల్పులు తెగబడ్డాడని ఓ విద్యార్థి చెప్పుకొచ్చాడు. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌస్టన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. గడచిన వారం రోజుల్లో స్కూల్‌లో కాల్పుల ఘటన జరగడం ఇది మూడోసారి. ఈ  ఏడాదిలో 22వ ఘటన. 


ఫైర్‌ డ్రిల్‌ జరుగుతుందేమో అనుకున్నా.. కానీ తర్వాత అవి తుపాకీ చప్పుళ్లని తెలిసి విద్యార్థులంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారని ఆ స్కూల్‌ ఉపాధ్యాయుడు చెప్పారు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహూటినా స్కూల్‌ దగ్గరకి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యలో భాగంగా ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: