ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా నుండి ప్రజాసమస్యల అవగాహన కై పోరాట యాత్ర చేపట్టిన పవన్ తన యాత్ర ప్రారంభంలో కీలక వ్యాఖ్యలు చేసాడు. యువత మద్దతుతో అక్కాచెల్లెళ్ల తోడుగా ఉంటే తాను 2019లో అధికారం చేపట్టడం ఖాయం అని అంటూ దీనికోసం తన అభిమానులు కూడ బాగా కష్టపడితేనే ఫలితం వస్తుంది అంటూ తన అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా టార్గెట్స్ ఇచ్చాడు పవన్. 
కార్యకర్తలు కష్టపడితే ముఖ్యమంత్రిని అవుతా
నిన్న శనివారం రాత్రి ఇచ్ఛాపురంలో బస చేసిన పవన్ సరిగ్గా ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపస కుర్ది వద్ద సముద్రతీరంలో గంగ పూజలు చేశాడు. అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ దగ్గరకు ఒక మహిళా వీరాభిమానంతో ముందుకు వచ్చి ముఖ్యమంత్రిగా పవన్ చూడాలని తనకు ఉందని చెపుతూ ఆ మహిళ పవన్ పై బిందెతో నీళ్లు పోస్తున్న దృశ్యం చూసి పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఒక్క క్షణం షాక్ అయ్యారు.
పవన్ యాత్ర మధ్యలో నాయకులు, కార్యకర్తల చేరిక
అయితే పవన్ నవ్వుతూ చేతులు జోడించి ఆ మహిళ చేత గంగా స్నానం చేయించుకున్న సంఘటన మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు పోరాట యాత్రను ప్రారంభించిన పవన్ ను చూడటానికి శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలు బాగానే వచ్చినా ఈ యాత్ర దృశ్యాలను ప్రముఖంగా అనేక న్యూస్ ఛానల్స్ ప్రసారం చేయకపోవడం గమనార్హం. 
శ్రీకాకుళం జిల్లాలో గంగ స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్
దీనితో పవన్ న్యూస్ చానల్స్ ను బహిష్కరించడం కాదు ఆ ఛానల్స్ పవన్ ను అతడికి సంబంధించిన వార్తలను వ్యూహాత్మకంగా తగ్గించి చూపిస్తున్నాయా అన్న అనుమానాలు కలగడం సహజం. అయితే ‘జనసేన’ అధినేత చేపట్టిన ఈ బస్సు యాత్ర కారు యాత్రగా మారిపోయింది. దీనికి కారణం పవన్ బస్సు యాత్రకోసం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న బస్సు ఇంకా పూర్తిగా తయారు కాలేదని శ్రీకాకుళం జిల్లా చేరేసరికి మరికొంత సమయం పడుతుంది అని అంటున్నారు. ఏమైనా పవన్ యాత్ర మొదట్లోనే గంగా స్నానం చేయడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: