కాంగ్రెస్ బిజెపిని కర్ణాటకలో నిలువరించాలని అనుకోవటం లాంటి బలహీనమైన కోరికవల్లే జెడిఎస్ కుమారస్వామి కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. 


ఒక సారి గణాంకాలు పరిశీలిస్తే అసలుకు కర్ణాటక అసెంబ్లీ 222 స్థానాల్లో ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు వచ్చిన సీట్లు 38.  నిజంగా జెప్పాలంటే హెచ్ డి దేవెగౌడ 'ఒక్కళిగ' కుల నాయకుడు మాత్రమే. దాంతో పాటు కొంత దళిత వర్గాల మద్దతు పొందిన చిన్న నాయకుడు మాత్రమే. 

JDS in karnaTaka కోసం చిత్ర ఫలితం

మొత్తం సీట్లతో పోల్చుకుంటే జేడీఎస్‌కు వచ్చిన సీట్ల సంఖ్య 17 శాతం. అయితే ఇప్పుడు ఆ పార్టీ నేతగా కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఇదే విచిత్రం అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కుమారస్వామికి మద్దతు ఇస్తోంది. అక్కడ బీజేపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే చాలు, అధికారం తమకు దక్కకపోయినా, బీజేపీకి దక్కకుంటే చాలు, ఈ మనస్తత్వంతో కాంగ్రెస్ ఆలోచిస్తూ ప్రజలకు ప్రజాస్వామ్య ప్రయోజనం దక్కనివ్వట్లేదు. ఇది నిజం గా ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం. ఎందుకంటే ప్రజలు కోరుకోని నాయకత్వం. 

JDS in karnaTaka కోసం చిత్ర ఫలితం

ఇక 218 శాసనసభ స్థానాలకు పోటీ చేసిన జెడిఎస్ 180 స్థనాల్లో పరాజైతులై 147 చోట్ల డిపాజిట్స్ కోల్పోయి చివరకు 38 స్థానాల్లో గెలిచింది. 81 శాతం స్థానాల్లో జనం వీరిని తిరస్కరించారు, కనీసం 67 శాతం ప్రాంతాల్లో పూర్తిగా డిపాజిట్స్ కూడా కోల్పోయేలా వీరిని ప్రజలు తన్నేశారు. అంటే కాంగ్రెస్ బిజెర్పి పై పగ కక్ష తో ప్రజలనెట్టిన ఈ గుదిబండను పెడుతున్నారన్నట్లు. కాంగ్రెస్ కు ప్రజలకంటే ప్రజా ప్రయోజనాలకంటే బిజెపి పై పగ తీర్చుకోవటం ముఖ్యం. అలాగే దేశం లోని ప్రతిపక్షాలు అన్నింటికీ అప్రయోజకులని అధికారంలోకి తెచ్చైనా బిజెపిని అధికారానికి దూరం పెట్టలనేది మూల సిద్ధాంతంగా మరింది. ఇక్కడ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరిగినా పాలన ఏవరో ఇష్టప్రకారం జరగటాన్ని ప్రజాస్వామ్యమని ఎలా అనగలం? 

chandrababu deve gowda kcr కోసం చిత్ర ఫలితం

కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని తనకు తానే కోల్పోతే ఓకే. కాని ప్రజల అస్థిత్వాన్ని బలి చేయటం ఇక్కడ మహా నేఱం. అందుకే ఇప్పుడు కుమారస్వామి సీఎం అవుతున్నాడు, బుధవారం ఈయన ప్రమాణస్వీకారం చేయనున్నాడు. అయితే కుమారస్వామి ప్రభుత్వం నిలబడుతుందా? "మినిమం మెజారిటీ" తో ఈయన బలపరీక్ష నెగ్గగలడా? అనేవి ప్రస్తుతానికి అనుమానాస్పదాలే! 

chandrababu deve gowda kcr కోసం చిత్ర ఫలితం

ఆ విషయం అలా ఉంచితే కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్తున్నాడట. ఈమధ్య కుమారస్వామిని, దేవేగౌడ ను కలిశారు కేసీఆర్. వీళ్లతో కూటమి కోసం ఈయన అర్రులు చాస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో కాంగ్రెస్, జేడీఎస్‌ల ఎమెల్యేల క్యాంపుకు కూడా కేసీఆర్ సహకారం అందించిన సమాచారం  ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను సత్కరించే భావనతో ప్రమాణస్వీకారానికి పిలిచాడట కుమారస్వామి.

chandrababu deve gowda kcr కోసం చిత్ర ఫలితం

మరి కేసీఆర్ వెళ్తాడో? లేక అక్కడ ఏర్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ మద్దతు తో కూడిన ప్రభుత్వం కాబట్టి వెళ్లకుండా ఉంటాడో? అనేది తేలాల్సి ఉండి. దేశంలో ఏ విజయ మైనా తన ఖాతాలో వేసుకునే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్తాడా? అనేది కూడా మరో భేతాళ ప్రశ్నే! చంద్రబాబును కూడా కుమార స్వామి ఆహ్వానించే ఉండవచ్చు. కారణం ఎక్కడో  10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని బేరం పెడితే 2019లో ప్రధాని కావచ్చనే అత్యాశ మనసులో ఉండవచ్చు. అప్పుడు బిజెపిని అధికారానికి  దూరం చేయటానికి ఇలాంటి బ్రోకరేజు పనులు చేయటానికి చంద్రబాబును మించిన వారెవరుంటారు?  ఈయన పిఎం కాలేరు ఎందుకంటే ఒక 13 జిల్లాల చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత పెద్ద దేశంలో పిఎం అయ్యే అవకాశం దొరకటం కల్లే. 

chandrababu deve gowda kcr కోసం చిత్ర ఫలితం

అయితే చివరగా ఒక మాట! అక్కడకు వెళ్తే చంద్రబాబు బీజేపీకి దొరికిపోయే అవకాశాలున్నాయి. వృద్దసింహంలాగా "నేను లేస్తే"  ఎవరిని బ్రతకనివ్వను అంటూ లేవలేని చంద్రబాబుకు ఇప్పుడు కుడిఎడమల పవన్-జగన్ ఉండగా కేంద్రం వైపు 2019 ఎన్నికల్లో చూసే అవకాశమే ఉండంటున్నారు ఎన్నికల పండితులు. జెడిఎస్ ఒక్కళిగల కు ప్రాతినిధ్యం వహిస్తే టిడిపి కమ్మలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించేస్తాయికి దిగజారి 13జిల్లాల స్థాయి నుండి అమరావతి చుట్టుముట్టు 3-4 జిల్లాల జూరిస్డిక్షణ్ కు పరిమితమౌతుందంటున్నారు.

chandrababu deve gowda kcr కోసం చిత్ర ఫలితం
సరిహద్దుల్లో తెలంగాణా కేసిఆర్, కర్ణాటక బిజెపి, తమిళనాడు అన్నాడిఎంకె లతో, చంద్రబాబు 'కర్ణాటకలో బిజెపి వ్యతిరేఖ ప్రచారం చేయించినట్లు'  బిజెపి దాడి చేయించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాపులతో, దళితులతో, హిందూసమాజంతో (టిటిడిలోను, హిందూ సమాజంపై టిడిపి చేసిన దుర్మార్గాలు ఔరంగజేబు కూడా చేయలేదంటున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లోని 46 దేవాలయాలను కూల్చివేసిన విషాధానికి హిందువులు సమాధానం రానున్న ఎన్నికల్లో చెప్పనున్నారు)  ప్రత్యేకించి బ్రహ్మణులతో గెలుక్కున్నాడు. రెడ్లు సరేసరి ఇదంతా చూస్తే టిడిపి కుంచించుకు పోతుందనే చెప్పాలి.  
pavan & jagan restrict chandrababu aggression in next election కోసం చిత్ర ఫలితం
అందుకే ధైర్యంగా కర్ణాటక వెళ్ళి బిజెపితో పెట్టుకోకపోవచ్చు. ఇక్కడే ఉండి తన ప్రభుత్వంపై తానే ధర్మపోరాటం చేసుకుంటూ అనుభవసారాన్ని వాడేస్తుంటారు. ఇక ఫైనల్గా,  జనం చెప్పేదేమిటంటే ఇసారి తెలుగుదేశం పార్టీలో ఆ నాయకులతో ఎవరూ పొత్తు పెట్టుకునే దాఖలాలు లేవని,  కొందరు విజ్ఞుల అభిప్రాయం కూడా! 
 pavan & jagan restrict chandrababu aggression in next election కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: