ఎన్నిక‌ల‌కు ఏడాది కంటే త‌క్కువ స‌మ‌యమే ఉండ‌టంతో స‌ర్వేలు జోరందుకున్నాయి. అధికార పార్టీ నాయ‌కులు త‌మ‌కు తెలిసిన‌, న‌మ్మ‌క‌స్తులైన వారితో త‌మ పార్టీ విజ‌యావ‌కాశాల‌పై, ఎమ్మెల్యేల గెలుపోట‌ముల‌పై స‌ర్వేలు నిర్వ హిస్తూ.. ఫ‌లితాల ఆధారంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో గెలుపుపై అధికార పక్షం ధీమాగా ఉ న్నా.. ఏపీ అధికార పార్టీలో ఆ విశ్వాసం క‌నిపించ‌డం లేదంటున్నారు విశ్లేష‌కులు. అందుకే ప్ర‌జా నాడి ఎలా ఉందో తె లుసుకునేందుకు త‌మ‌కు బాగా కావాల్సిన‌, స‌ర్వేల్లో ఆరితేరిన వ్యక్తిని సంప్రదించార‌ట టీడీపీ పెద్ద‌లు. ఆయ‌న ద్వా రా సీక్రెట్ స‌ర్వే నిర్వ‌హించార‌ట‌. ఈ స‌ర్వే దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌ట‌. 

Related image

ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ఫ‌లితాలు ఎ లా ఉన్నాయో తెలుసుకున్న నేత‌ల‌కు నోట‌మాట రావ‌డం లేదట‌. స‌ర్వే ఫ‌లితం చూసిన వీరంతా అవాక్క‌య్యార‌ని తెలు స్తోంది. దాదాపు 60 శాతం మంది ప్ర‌భుత్వానికి వ్యతిర‌కంగా ఉన్నార‌ని తేల‌డంతో.. అయోమ‌యంలో ప‌డిపోయార‌ట‌. ఏపీలో ఆయ‌న స‌ర్వేలంటే అంద‌రికీ అమితాస‌క్తి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అయినా ఒక్కోసారి త‌ప్పుగా రావొచ్చేమో గానీ.. ఆయ‌న స‌ర్వేలో ఫ‌లితాలు మాత్రం అంచ‌నాకు త‌గ్గ‌ట్టే ఉంటాయి. ప్రజానాడిని క‌నుక్కోవ‌డంలో ఆయ‌న‌కు మించిన వారు లేరంటారు విశ్లేష‌కులు. మ‌రి అలాంటి వ్య‌క్తి చేసిన స‌ర్వేలో టీడీపీకి ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయి? అనే విష‌యంపై ప్ర‌జ‌ల్లో కంటే నాయ‌కుల్లోనే ఎక్కువ చర్చ జ‌రుగుతోంద‌ట‌. 

Image result for karnataka election results

ప్ర‌స్తుతం తెలుగు దేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంద‌నే గుస‌గుస‌లు జోరందుకున్నాయి. బీజేపీ లేదు, మిత్రుడ‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వేరే కుంప‌టి పెట్టుకున్నా డు. పైగా ప్ర‌భుత్వంపైనే ఘాటైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. మ‌రోప‌క్క ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రం ప్రాజెక్టు ఇలాంటివ‌న్నీ అధిగ‌మిస్తేనే చంద్ర‌బాబుకు 2019లో ఓట్లు రాలేది. ఈ విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. ప్ర‌భుత్వంపై ఇన్ని ప్రతికూలతల మధ్య ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిన తరుణంలో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు.. విశ్వ‌స‌నీయుడైన, స‌ర్వేల్లో ఆరితేరిన వ్యక్తితో అధికార పార్టీ ఓ సర్వే చేయించుకుంది.


ఇది ఇప్పటికే 70 శాతం పూర్త‌యింది. 70 శాతంలో అరవై శాతానికి పైగా అధికార టీడీపీకి వ్యతిరేక ఫలితాలు రావటంతో పార్టీ పెద్ద‌లు విస్తుపోతున్నార‌ట‌. ఈ నివేదికతో కొంత మంది పెద్దలు ఓ  పత్రికాధిపతితో కూడా మాట్లాడి.. నష్ట నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా నిండా ఏడాది కూడా లేని సమయంలో సర్వేలో వెల్లడైన అంశాలు అధికార పార్టీని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయ‌ట‌. 


కష్టాల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళుతున్నాడని టీడీపీ నేతలు.. అనుకూల మీడియా విస్తృత ప్రచారం చేస్తున్నా.. చాలా వరకూ ప్రజలు వీటిని నమ్మటం లేదనే విషయం సర్వేలో వెల్లడైంది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పలుమార్లు మాట మార్చిన అంశంపై కూడా టీడీపీపై వ్యతిరేకత పెరగటానికి కారణం అయిందట‌. జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్‌.. ప్రస్తుతం ఫీల్డ్ లో దిగి పొలిటికల్ `ఫైటింగ్` ప్రారంభించటంతో రాబోయే రోజుల్లో సీన్ మరింత మారే అవకాశం ఉందనే టెన్షన్ టీడీపీ నేతల్లో ఉంది. ప్రతిపక్ష నేత జగన్‌మోహ‌న్‌రెడ్డి చేసే విమర్శల కంటే పవన్ చేసే విమర్శలు వేగంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: