కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణం రేపు కర్ణాటకలో కొలువుదీరనున్న సందర్భంగా, పాఠకులకోసం ఈ చిన్న మాట ---  రేపు బుధవారం అంటే 23.05.2018 సాయంత్రం నాలుగు గంటల సమయంలో అనేక అనూహ్య నాటకీయ పరిణామాల తరవాత "కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి" కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరక ముందే, కాంగ్రెస్ లో అసమ్మతి వార్తలు అటు కాంగ్రెస్ లో ఇతు జెడిఎస్ పార్టీల్లో కలకలం మాతమేకాదు ఒకరకమైన అలజడి రేపుతున్నాయి 
Image result for DK sivakumar, Kumaraswami, Rahul gandhi
ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలోని ఒక బలమైన వర్గం జేడీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై సముఖంగాలేదని వార్తలువినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Image result for DK sivakumar, Kumaraswami, Rahul gandhi
నిన్న(సోమవారం) మీడియాతో మాట్లాడిన శివకుమార్‌, తాను 1985నుంచి అనేక ఎన్నికల్లో దేవె గౌడ కుటుంబంపై పోటీ చేస్తూ వస్తున్నానని అనారు. లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడపై పోటీచేసి ఓడిపోయిన తాను, ఆయన కొడుకు కుమారస్వామిపై, కోడలుపై పోటీచేసి గెలిచానని అన్నారు. వారితో జరిగిన జరుగుతున్న రాజకీయ చదరంగంలో ఎన్నో ఏత్తులను పైఎత్తులను చిత్తుచేశానన్న శివకుమార్‌, ఇప్పుడు తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్ణయం మేరకే జేడీఎస్‌ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించాల్సి వస్తుందని తమకు ఇష్ట్మై కాదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ, కర్ణాటక ప్రజల సంక్షేమం కోసం లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రమే తమ పర్స్పర వైరుద్యాలను వదిలేసి ముందుకు వచ్చామని పేర్కొన్నారు.
Image result for DK sivakumar, Kumaraswami, Rahul gandhi
మరి జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా? అన్న పాత్రికేయుల ప్రశ్నకు సమాదానంగా "అధిష్టానం కోసం చేదును సైతం మింగాల్సి వస్తోందని, అయినా వ్యక్తిగత అభిప్రాయాల కన్నా పార్టీ సమిష్టి నిర్ణయాలకే ఎక్కువ విలువ ఉంటుందని కదా!" అని వ్యాఖ్యానించారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించడం తప్ప వేరే దారేమీ లేదని అది తన కర్తవ్యమని శివకుమార్‌ తెలిపారు. అందుకే జేడీఎస్‌ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తన సమ్మతి తెలిపానని పేర్కొన్నారు.  
Image result for DK sivakumar, Kumaraswami, Rahul gandhi
ఐదేళ్ల సుధీర్ఘ కాలం పాటు "కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం" కొనసాగుతుందా? అన్న ప్రశ్నకు జవాబుగా "ప్రస్తుతం ఆ విషయంపై తాను ఎలాంటి సమాధానం చెప్ప లేను" అని అన్నారు. కాలమే మాత్రమే అందుకు సమాధానం చెబుతుంది" అంటూ వ్యాఖ్యానించారు. తమ ముందు ఎన్నో సవాళ్లున్నాయని అంటున్న శివకుమార్‌, "కేబినెట్‌ కూర్పు" పై అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు.
Image result for DK sivakumar, Kumaraswami, Rahul gandhi
2019లోక్‌సభ ఎన్నికలకు ముందు జేడీఎస్‌ వంటి పార్టీతో కూటమి ఏర్పాటు చేయడం తమకు సానుకూల అంశంగానే ఉండబోతుందంటూ వ్యాఖ్యానించారు.

Image result for DK sivakumar, Kumaraswami, Rahul gandhi

మరింత సమాచారం తెలుసుకోండి: