వివాదాస్పద స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ తూత్తుకుడి కలెక్టరేట్ వద్ద నిరసనకారులు చేపట్టిన ర్యాలీ రణరంగాన్ని తలపించింది.  తమిళనాడులోని తూత్తుకుడి పట్టణం రక్తసిక్తంగా మారింది. కాలుష్యాన్ని వ్యాపింపచేస్తున్న స్టెరిలైట్ రాగి పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో హింస చోటుచేసుకుంది. అల్లర్లకు దిగిన గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించారు. ఈ మొత్తం ఘటనలపై న్యాయ విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. తూత్తుకుడి స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ నెల రోజులుగా నిరసన కారులు ఆందోళన చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కలెక్టరేట్‌లోకి చొరబడి నిప్పుపెట్టారు.కార్మిక సంఘాల పిలుపు మేరకు తూత్తుకుడి పట్టణంలో షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్ విధించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్... కేవలం ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని ఎస్ఏవీ మైదానంలో మాత్రమే ఆందోళన తెలిపేందుకు అనుమతి ఇచ్చారు.రాగి కర్మాగారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు దాదాపు 4 వేల మంది ఆందోళన చేపట్టారు.

తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి కర్మాగారం 20 సంవత్సరాలుగా వివాద కేంద్రంగా నిలిచింది. వేదాంత గ్రూప్ యూనిట్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. తూత్తుకుడికి సమీపంలోని మీలవితన్ వద్ద ఈ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఈ ఫ్యాక్టరీ నుంచి 2013లో గ్యాస్ లీకైంది. ఈ ఫ్యాక్టరీ మూసివేతకు అప్పటి ముఖ్యమంత్రి జె జయలలిత ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న కారణంపై ఈ ఫ్యాక్టరీ లైసెన్సు పునరుద్ధరణకు తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు నిరాకరించింది. రాగి వ్యర్థ పదార్థాలు, వృథా జలాల వల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ఫ్యాక్టరీ నుంచి సాలీనా 4లక్షల టన్నుల రాగి లోహ ఉత్పత్తి అవుతోంది.

Image result for rahul gandhi

రాహుల్ దిగ్భ్రాంతి :
ఇదిలా ఉంటే..తూత్తుకుడి ఘటనపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. పోలీసు కాల్పుల్లో 9 మంది మరణించడం , రాష్ట్రప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: