జనసేన పోరాట యాత్రలో భాగంగా పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితులతో జరిగిన సమావేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కనీసం ఆరోగ్య  శాఖ మంత్రి కూడా లేరని 48 గంటలలో ప్రభుత్వం స్పందించి మంత్రి నియామకం , కిడ్నీ బాధితులను ఆడుకోడానికి సత్వర చర్యలు చేపట్టాలని , ప్రభుత్వం పట్టించుకోని యెడల తాను కిడ్నీ బాదితుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం తెలిసినదే.

ప్రభుత్వం తన డిమాండ్‌పై పట్టించుకోకపోవడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తోన్న రిసార్టులోనే పవన్‌ నిరాహార దీక్ష చేస్తారని, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్‌ నిరాహార దీక్ష ఉంటుందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదలైంది. మే 26 వ తారీఖున ఎన్టీఆర్ గ్రౌండ్ , నరసన్నపేట , శ్రీకాకుళం నందు ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు అండగా నిలబడుతూ తక్షణం  ప్రభుత్వం స్పందించవలసినదిగా కోరుతూ పవన్ నిరాహారదీక్ష చేయనున్నారు. నిజానికి పవన్‌ కల్యాణ్‌ నిన్నటి నుంచి ఘనాహారాన్ని తీసుకోవడం మానేశారని అందులో పేర్కొన్నారు.
Image result for ఉద్దానం కిడ్నీ బాధితు
ఉద్దానం..  సముద్ర తీరం, మరో ప్రక్క కొబ్బరి, జీడి, వరి పోలాలతో నిత్యం అందంగా వుండడంతో 7 మండలాల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. అలాంటి స్వర్గంలో ప్రస్తుతం నరకం కనబడుతోంది. ఎన్నో అందాలతో వుండే ఉద్దానం ప్రాంతం ఇప్పుడు కిడ్నీ వ్యాధులతో వణికిపోతోంది. కిడ్ని సమస్యలతో ఆ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దున వున్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాలు ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు.ప్రాథమిక అంచనాల ప్రకారం గత 20 సంవత్సరాలలో 15వేల మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం దాదాపు 20వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
Image result for ఉద్దానం కిడ్నీ బాధితు
ఈ నేపథ్యంలో  శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాన్ నిరాహార దీక్షకు చేయబోతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: