ప్ర‌జారాజ్యం!  ఇటీవ‌ల మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది!! 2007లో మెగా స్టార్ ప్రారంభించిన పార్టీ గురించి ఇప్పుడు చ‌ర్చ జ‌ర‌గ‌డం ఏంట‌నే సందేహం రాక‌పోదు. అయితే, అప్ప‌ట్లో ఎన్నో ఆశ‌ల‌తో అరంగేట్రం చేసిన ప్ర‌జారాజ్యం.. దివంగ‌త వైఎస్ దెబ్బ‌కు, వ్యూహాత్మ‌క లేమితో కుదేలైన ప‌రిస్థితి తెలిసిందే. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన జ‌న‌సేన‌కూ ఉంటుందా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేత‌ల‌లో ఇదే చ‌ర్చ సాగుతోంది. అప్ప‌ట్లో చిరంజీవి ఎలాంటి వ్యూహం లేకుండానే పార్టీ పెట్ట‌డం ప్ర‌జారాజ్యం పేరుతో మొత్తం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ పోటీ చేయ‌డం కేవ‌లం రెండంకెల సంఖ్య‌లోనే ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవ‌డం వంటి ప‌రిస్థితులు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చాయి. 

Image result for chiranjeevi praja rajyam

ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ అదే ప‌రిస్థితి పున‌రావృత‌మ‌య్యేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్ప‌టి వైఎస్ పాత్ర‌ను ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు పోషించే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ధ‌ర్మ పోరాట దీక్ష స‌భ‌ల వెనుక వ్యూహం కూడా ప‌వ‌న్‌ను బ‌ద్నాం చేసేందుకునేన‌ని చెబుతున్నారు. కులం పేరుతో ఓ నాయ‌కుడు ప్ర‌జ‌ల‌ను చీల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడంటూ.. బాబు ఇటీవ‌ల విశాఖ‌లో నిర్వ‌హించిన స‌భ‌లో పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇదే ప‌రిణామం.. రాబోయే రోజుల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.
Image result for ysr
అప్ప‌ట్లో వైఎస్ కూడా చిరంజీవిని తీవ్ర స్థాయిలో ఏకేశారు. ఈయ‌న వ‌ల్ల ప్ర‌జారాజ్యం స్థాప‌న దేవుడెరుగు.. ఫ్యామిలీ రాజ్య స్థాప‌న ఖాయ‌మంటూ విరుచుకుప‌డ్డారు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొనాల్సి వ‌స్తుంద‌నే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న ఫ్యామిలీని ఎంట్రీ చేయ‌లేదు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌ల్లో వైఎస్ ప‌ట్ల ఉన్న అభిమానం చెక్కు చెద‌ర‌కుండా చూసుకోవ‌డంలో ఈ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు స‌క్సెస్ అవుతూనే వ‌చ్చింది. అదేవిధంగా జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర కూడా పార్టీకి ప్ల‌స్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పార్టీ వ‌చ్చినా.. త‌న‌కు పెద్ద ఎఫెక్ట్ కాద‌ని, త‌మ వెంట ప్ర‌జ‌లు ఉన్నార‌ని జ‌గన్ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు.


మొత్తంగా చూసుకుంటే.. ప‌వ‌న్ కేవ‌లం 30 స్థానాల్లో మాత్రమే త‌న హీరోయిజం, కుల వ‌ర్గాల తో నెట్టుకొచ్చే అవ‌కాశం ఉంది త‌ప్ప మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ఎక్క‌డా ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌న‌సేనా ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ని కూడా చ‌ర్చ న‌డుస్తోంది. వ్యూహం మార్చ‌డ‌మో?  లేదా మెగా ఫ్యామిలీని రంగంలోకి దింప‌డ‌మో ఆయ‌న ముందున్న ప్ర‌ధాన చ‌ర్య‌లుగా పేర్కొంటున్నారు. మ‌రి ఏం జ‌రుఉతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: