"మూడు దశాబ్ధాలుగా నిరంతరం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన నాకు చంద్రబాబు కనీసం 5నిమిషాలు మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోంది" అని ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం మిషగా చూపి నాకు గవర్నర్ పదవి రాకుండా ఆపింది నిజం కాదా?" అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. 
సంబంధిత చిత్రం
తెలంగాణ టీడీపీ మహానాడుకు మోత్కుపల్లి హాజరు కాకపోవటం ఆ పార్టీలో ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు  మీడియాతో మాట్లాడారు. తనను టీడీపీ నుంచి గెంటేసే కుట్ర కూడా జరుగుతోందని ఆరోపించారు. 
motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం
"రేవంత్‌ రెడ్డిని ఎదిరించి మాట్లాడినందుకే నన్ను పక్కనబెట్టారు. చంద్రబాబు కనీసం నాకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం గురించి కనీస అవగాహన లేనివారికి పదవులు కట్టబెడుతున్నారు" అని మోత్కుపల్లి అన్నారు. 
motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం
"నేను దళితుణ్ని కాబట్టే తనను మహానాడుకు పిలవలేదని ఏ తప్పుచేశానో? నాకైతే తెలియదు ఫలానా తప్పుచేశారని చెబితే నేనెంతో సంతోషిస్తాను, నేను చేసిన తప్పు వల్ల పార్టీకి గాని, చంద్రబాబు కు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి" అని డిమాండ్‌ చేశారు.  ఇప్పటికీ నేను చంద్రబాబు పక్షానే ఉన్నా. నాకు అపాయింట్‌మెంట్‌ దొరికితే ఈ ప్రెస్‌-మీట్‌ పెట్టే అవసరమే ఉండేది కాదు. ఇప్పటికైనా మాట్లాడటానికి పిలిస్తే, వచ్చేందుకు సిద్ధం. నా జీవితమంతా టీడీపీకే అంకిత మిచ్చాను. నాడు ఎన్టీఆర్‌పై, నేడు చంద్రబాబుపై విశ్వాసంతోనే పనిచేశాను" అని మోత్కుపల్లి ఆవేదనగా మాట్లాడారు.  
motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం
"నేను చేసిన తప్పేంటో చెప్పాలి. నా తప్పు గురించి నాకు చెప్పేవరకు నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను పార్టీ కోసం అహర్నిశమూ నిజాయితీగా పని చేయడమే తప్పా? చంద్రబాబు ను నమ్మి నా సర్వస్వం కోల్పోయాను" అని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  ‘కొత్తగా వచ్చిన నాయకులను నింగికి ఎత్తేస్తున్నారు. పార్టీ కోసం ఎంతో చేసిన నన్ను మహా నాయకుడు ఎన్టీఆరే నన్ను శబాష్ అన్నారు. నాలాంటి నాయకుడి కోసమే చూస్తున్నా నని నాడు ఎన్టీఆరే పొగిడారు. 2008-2012 మధ్య కాలంలో చంద్రబాబుకు నేను కాపలా కుక్కలా ఉన్నాను. ఆయన కోసం దెబ్బలు కూడా తిన్నాను. నా వెంట ఆయన ఉన్నారనే నమ్మకంతో పనిచేశాను. పార్టీ నుంచి అనేక మంది నేతలు, ఎమ్మెల్యే లు వెళ్లిపోయినా ఆయనకు తోడుగా అండగా మద్దతుగా నిలబడ్డాను. ఇలా జరుగుతుందని ఏనాడూ ఊహించలేదు" అని మోత్కుపల్లి వాపోయారు.  
motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం
"రేవంత్‌ రెడ్డి కూతురు పెళ్లి చంద్రబాబు దగ్గరుండి చేయించారు, కానీ నా బిడ్డ పెళ్లికి ఎప్పుడో 4 గంటలకు వచ్చారు అంటె నేను దళితుణ్ణనేకదా? చిన్న చూపు పలచన చేయటం? అని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. "రేవంత్‌ రెడ్డిని చంద్రబాబు నమ్మారు, చివరకు ఏమైంది? ఆయనే తెలంగాణాలో పార్టీని సర్వనాశనం చేశారు. టి-టీడీపీ కాంగ్రెస్‌‌లో విలీనం అవుతుందని చెప్పారు. ఆయనకు అడ్డు చెప్పి మాట్లాడే సాహసం ఎవరూ చేయలేదు. ఆయనకు వ్యతిరేకంగా నోరు విప్పినందుకు నన్ను పక్కన బెడుతున్నారు" అని మోత్కుపల్లి అన్నారు. 
motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం
తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని మోత్కుపల్లి నరసిమ్హులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయడమే ఉత్తమం అని చెప్పారు. ఈ విషయంలో తాను గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 
motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం
మాల మాదిగలకు గౌరవం ఇవ్వని చంద్రబాబు, అంబేద్కర్ విగ్రహం పెడతానంటే నమ్మేదెలా? ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు, నేను ఆంధ్రా ప్రాంతానికి కూడా వెళ్తాను, మాల మాదిగల విషయం గురించి ప్రశ్నిస్తాను, ఆంధ్రాలో ఉన్న కొన్ని కులాలు తెలంగాణ లో లేవు. అలాగే తెలంగాణలో ఉన్న కులాలు ఆంధ్రాలో లేవు. కానీ, నా కులం దేశ మంతా ఉంది. దళితుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను" అని మోత్కుపల్లి ఉద్వేగంగా అన్నారు. 

motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం

"15 సంవత్సరాల దోస్తాన చేసిన కేసీఆర్ ఇట్లా బిడ్డ పెళ్లి ఉంది అని చెప్పగానే ఆత్మీయంగా స్వాగతం పాలకడమే కాదు పెళ్లి కూడా వచ్చారు. అయ్యా చంద్రబాబు గారు ఆంధ్రాలో కూడా దళితులు ఉన్నారు జాగ్రత్త.  కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. కనీసం మీరు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం నాకు సమయం ఇవ్వలేదు. మీరా దళితులకు న్యాయం చేసేది. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు బడుగు బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఇదేనా"    అని సూటిగా ప్రశ్నించారు.

motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం

తనకు 29సార్లు డిల్లీ చుట్టూ తిప్పించుకొని అప్పాయింటుమెంట్ యివ్వలేదని ప్రధాని నరెంద్ర మోడీని నిరంతరం దూషించే చంద్రబాబు, నీ పార్టీ కోసం తన సర్వస్వం దారపోసిన మోత్కుపల్లి నరసింహులుకు ఐదే ఐదు నిమిషాలు సమయం ఇవ్వకపోవటం నేరం కాదా?  కాస్త ఆలోచించండి బాబు గారు!  

motkupalli narasimhulu & chandrababu disputes కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: