ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనూహ్యంగా ఆయ‌న కుటుంబం నుంచి తొలిసారి పొలిటిక‌ల్ మ‌ద్ద‌తు ల‌భించిం ది. జ‌న‌సేన పార్టీని స్థాపించి నాలుగేళ్లు గ‌డిచినా ఇప్ప‌టి వ‌రకు ప‌వ‌న్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. ఆయ‌న‌పై టీడీపీ నుంచి తిరుగు బాటు స్వ‌రం వినిపిస్తున్నా.. రాజ‌కీయాలకు త‌ట‌స్థంగా ఉన్న నాగ‌బాబు కానీ, అల్లు అర‌వింద్‌ల నుంచి కానీ ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు. ఇక‌, మ‌రో ఏడాది ఎన్నిక‌లు ఉండ‌గా..  ప‌వ‌న్ త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. 

Image result for tdp\

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ విస్తృతంగా రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యాడు. అయితే, త‌న ఒక్క‌డి వ‌ల్ల పార్టీకి బ‌లం చేకూరుతుంద‌నే విష‌యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌కు ఫ్యామిలీ నుంచి మంచి స‌పోర్ట్ ద‌క్కింది. బాబాయ్ కు మద్దతుగా బరిలోకి దిగుతా అంటున్నాడు చెర్రీ.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. శ్రీకాకుళంలో పవన్ పోరాటయాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. మెగా హీరో రామ్ చరణ్ తాను జనసేన తరపున ప్రచారం చేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. 

Related image

ఇందుకు పవన్ కళ్యాణ్ అనుమతిస్తే చాలని చెబుతున్నారు. ప్రస్తుతం బాబాయ్ ఒక్కరే ఎంతో కష్టపడుతున్నారని వ్యాఖ్యానించాడు.  వాస్తవానికి తాను ప్రజారాజ్యం సమయంలోనే ఎన్నికల ప్రచారం చేద్దామనుకున్నానని..అప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణే వద్దని వారించారని తెలిపాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరి రామ్ చరణ్ కోరికను పవన్ కళ్యాణ్ తీరుస్తారో లేదో వేచిచూడాల్సిందే. 

Image result for janasena srikakulam tour

ప్ర‌స్తుతం వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. చిరంజీవి ఫ్యామిలీలో చిరు ఒక్క‌డే కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. ఆయ‌న కు ఎంపీ సీటు ద‌క్క‌డంతో ఆయ‌న ఆ పార్టీలో ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌ని ప‌క్షంలో.. ఇటు ప‌వ‌న్ పార్టీ పుంజుకుని ప్ర‌జ‌ల్లోకి దూసుకు పోయిన ప‌క్షంలో చిరంజీవి మొద‌లు మొత్తం ప‌వ‌న్ వెంట న‌డిచేందుకు రెడీగానే ఉన్నార‌ని స‌మాచారం. అయితే, ఇప్పుడు దీనిలో ప్రాధ‌మికంగా చెర్రీ.. ప్ర‌క‌ట‌న చేశాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో ఆరు నెల‌ల్లోనే మెగా ఫ్యామిలీ జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి. ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: