చాలమంది టాప్ హీరోలు లా పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలో ఎప్పుడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించలేదు. అయితే పవన్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత జనాకర్షణ కోసం గుబురు గడ్డంతో తెల్లని బట్టలు వేసుకుని మధ్యమధ్యలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని తన డిఫరెంట్ గెటప్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. 
Image may contain: 4 people, people sitting and beard
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘పోరాట యాత్ర’ ఇప్పుడు నిరాహార దీక్షగా మారడంతో అందరి దృష్టి పవన్ పై పడింది. ఉద్దానం కిడ్నీ వ్యాది గ్రస్తుల విషయంలో తాను ఇచ్చిన డెడ్ లైన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోవడంతో పవన్ ఈరోజు ఉదయం నుండి అంబేద్కర్ సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ ఆర్డ్స్ కాలేజీ గ్రౌండ్స్ లో పవన్ ప్రారంభించిన నిరాహార దీక్ష శిబిరంలో పవన్ గెటప్ ను చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
Image may contain: 10 people, people smiling, people sitting
తెల్లని వస్త్రాలతో గుబురు గడ్డంతో నుదుటున తిలకం కళ్ళజోడు చేతిలో పుస్తకం మేడలో బంతి పూల దండతో డిఫరెంట్ లుక్ లో కనిపించిన పవన్ ను చూసి అతడి అభిమానులు కూడ ఆశ్చర్య పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిరాహార దీక్ష వేదిక నుండి పవన్ తెలుగుదేశం పార్టీని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని ఘాటైన విమర్శలతో టార్గెట్ చేస్తాడు అనుకుంటే దానికి భిన్నంగా మౌన మునిలా ఒక లైబ్రరీ హాలులో కూర్చున్నట్లు పవన్ తనకు నచ్చిన గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు చదువుతూ కనిపించడం దేనికి సంకేతం అంటూ పవన్ అభిమానులే ఆశ్చర్య పోతున్నట్లు సమాచారం. 
Image may contain: 8 people, people sitting
ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్ష శిబిరానికి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు వచ్చి పవన్ కు సంఘీభావం తెలుపుతూ తాము పవన్ వెంట ఎప్పుడూ ఉంటాము అన్న సంకేతాలను మరోసారి ఇచ్చారు. అయితే పవన్ నిరాహార దీక్ష విషయానికి ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వని నేపధ్యంలో ఈ సాయంత్రానికి కూడ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే పవన్ నిరాహార దీక్షకు విలువ లేదా అన్న సందేహాలు కలగడం సహజం. పవన్ ఇలా కవిత్వాలు చదువుకుంటూ నిరాహార దీక్షలు చేసే బదులు తానే స్వయంగా రంగంలోకి దిగి తానే ఉద్దానం బాదితుల కోసం ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: