ఉప ఎన్నికల ఫలితాల్లో  బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.  దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్ధానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. యూపీలోని కైరానా లోక్ సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్, భండారా-గోండియాల్లో బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. 

నాగాలాండ్‌ లోక్‌సభ స్థానం ఫలితాల్లో పీడీఏ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. కర్ణాటక ఆర్‌ఆర్‌ నగర్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజార్టీ  దిశగా ఆధిక్యం కనబరుస్తున్నారు. 


- మహారాష్ట్ర : పాల్ఘర్ (లోక్ సభ స్థానం) లో శివసేన పై గెలిచిన బీజేపీ. 24 వేల ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ అభ్యర్థి రాజేంద్ర

- యూపీ : కైరానా (లోక్ సభ) లో విజయానికి దగ్గరగా ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ

- ఉప ఎన్నికల్లో లోక్ సభ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ

- మేఘాలయ: అంపటి (అసెంబ్లీ) లో కాంగ్రెస్ అభ్యర్థి మియానీ డి షిరా గెలుపు.  3,191 ఓట్ల ఆదిక్యంతో గెలిచిన మియానీ డి షిరా గెలుపు.

- తాజాగా గెలుపుతో అతిపెద్ద పార్టీ గా అవతరించిన కాంగ్రెస్

- వచ్చే ఎన్నికల్లోనూ యూపీ లో ప్రతిపక్షాలు ఏకమయ్యే అవకాశం

- కర్ణాటకలో రాజకీయాలు పునరావృతం అయ్యే అవకాశం

- బండారా-గోండియాల (మహారాష్ట్ర) లోక్ సభ స్థానంలో ఆదిక్యంలో ఎన్సీపీ

- జోకిహాట్ లో (బీహార్) 40 వేల ఓట్ల తేడాతో ఆర్జేడీ విజయం

- నాగాలాండ్ లో లోక్ సభ స్థానంలో భారీ ఆదిక్యంలో ఎన్ డిపీపీ
- సిల్లీ (జార్ఘండ్) సిటు లో జేఎంఎం గెలుపు


మరింత సమాచారం తెలుసుకోండి: