ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా అంతరించి పోతున్నాయని చెప్పడానికి ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందు జరిగాయి..జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది మానవత్వాన్ని మరచి నిర్లజ్జగా వ్యవహరించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.  కొంత మంది తల్లిదండ్రులను రోడ్డు పడివేయటం..తమ అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని చిన్న పిల్లలకు నరకం చూపించి తల్లుల విషయాలు...వృద్దాప్యంలో ఉన్న తల్లిని టెర్రాస్ పై నుంచి నెట్టిన దౌర్భాగ్యపు తనయుడు ఇలా ఎన్నో కథనాలు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా ఓ కోడలు తన అత్తపై అది దారుణంగా దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి ఆమెను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. యశోదాపాల్‌ అనే 75 ఏళ్ల వృద్ధురాలు భర్త మరణించడంతో కొడుకు, కోడలితో పాటు గారియాలో నివాసం ఉంటోంది. యశోదకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. కోడలు నిత్యం ఆమెను హింసిస్తూ ఉండేది.

ఈ క్రమంలోనే బుధవారం పెరట్లోకి వెళ్లి పూలు కోస్తున్న యశోదను చూసిన కోడలు కోపంతో ఆమెపై దాడి చేసింది.  నాకు చెప్పకుండా పూలు కోస్తావా అంటూ వృద్దరాలని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చి అత్తను చావబాదింది.

విషయాన్ని గమనించిన ఇంటి పక్కన వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అత్తను హింసించిన కోడల్ని అరెస్టు చేశారు.ఇం‍దుకు సంబంధించిన వీడియోను కోల్‌కతా పోలీసులు అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: