ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లీటరు పెట్రోల్ ధరను ఒక్క పైసా తగ్గించడం ప్రపంచలోనే ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో చిన్నా, పెద్దా అందరినీ వేధిస్తున్నారని మండిపడ్డారు.

ఒక్కొక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం లేదని విమర్శించారు. ఈ మద్య  కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ విభేదించిన తర్వాత నుంచే తమపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ ఒక్కమాట అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఆయన ఏమాత్రం స్పందించడం లేదని చెప్పారు.

రాయలసీమ డిక్లరేషన్ తో ప్రాంతాల మధ్య చిచ్చు రాజేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. చివరకు తిరుమలను కూడా ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నించిందని విమర్శించారు. మోదీవి అన్నీ ఉత్తుత్తి మాటలేనని, చేతల్లో ఏమీ లేదని దుయ్యబట్టారు. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమానికి కొందరు తూట్లు పొడిచినట్టే... ఇప్పుడు ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కుట్ర రాజకీయాలపై ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: