గత నెల కర్ణాటకలో ఎన్నికల హడావుడి ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే.  అయితే బీజేపీ తరుపు నుంచి యడ్యూరప్ప సీఎం పదవి కోసం ఆశపడ్డారు..అయితే పదవి వచ్చినట్లే వచ్చి జారిపోయింది.  వాస్తవానికి బీజేపీకి 104 సీట్లు వచ్చినా అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కలవడంతో సంఖ్యాబలం పెరిగిపోయింది. 
Image result for PM MODI
సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తన సంఖ్యా బలాన్ని చూపించుకోలేక పోవడంతో పదవి నుంచి వైదొలిగారు.  ప్రస్తుతం కర్ణాటకలో సీఎంగా కుమార స్వామి నియమితులయ్యారు. తాజాగా కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారిక సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరూ ఫోన్లను వినియోగించరాదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు.

మీటింగ్ లు జరుగున్నప్పుడు కొందరు అధికారులు ఫోన్లను చూస్తున్నారని... దీనివల్ల చర్చలకు ఇబ్బంది కలుగుతోందని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. అంతే కాదు తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు ఫోన్లను తీసుకురాకూడదని తెలిపారు. సమావేశం ముగిసేంత వరకు ఫోన్లను కోఆర్డినేషన్ అధికారికి అప్పగించాలని చెప్పారు. 
Image result for kumaraswamy MEETING
గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇలాంటి ఆజ్ఞలే వేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం మోడీని కర్ణాటక సీఎం కుమార స్వామి అనుకరిస్తున్నారా అని అందరూ అనుకుంటున్నారు. కాగా, మోదీ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే కుమారస్వామి కూడా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: