ఆంధ్రప్రదేశ్ లో టీటీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లో నిలవడం తెలిసిందే.  గత వారం జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మహానాడు వేదిక నుంచి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ప్రసంగిస్తూ   వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జేసీ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు నిరసనగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
లోకేష్‌ను సీఎం చేయాలనుకుంటున్న బాబు, కానీ
జేసీ దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపిన దళిత, గిరిజనులు ఆపై దాన్ని దగ్ధం చేయగా, తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జేసీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలకు నిరసనగా పలువురు దిష్టిబొమ్మ శవయాత్ర, దహనం వంటివి చేపడుతున్నారని, మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటిని తండ్రికి కొడుకులు చేస్తారన్నారు.  
జేసీ దివాకర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్
 అబ్బో నాకు జిల్లాలో ఇంతమంది కొడుకులా? ఎప్పడు కనింటినో ఎమో నాకే తెలియదు అని వ్యాఖ్యానించారు. దాంతో అసలే కోపంతో ఊగిపోతున్న దళిత సంఘాలు మరింత ఆగ్రమానికి లోనయ్యారు. తాను ప్రజా ప్రతినిధినన్న స్పృహ కూడా లేకుండా మొత్తం దళిత జాతిని ఆయన కించపరుస్తున్నారని ఆరోపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: