రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో చెప్ప‌డం క‌ష్టం. ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటారో కూడా చెప్ప‌డం క‌ష్టం. అది కూడా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నేత‌లు ఎవ‌రికి వారు వ్యూహాలు మార్చుకుంటు న్నారు. వీరిలో ప్ర‌ధానంగా గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తున్న పేరు అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌. అత్యంత వివాదాస్ప‌దురాలైన ఈ మాజీ ఆర్డీవో.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి.. గెలిచిన గీత‌.. త‌ర్వాత అనూహ్యంగా పార్టీకి రాం రాం చెప్పి.. జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆ త‌ర్వాత టీడీపీలో ఎంట్రీకి ట్రై చేసినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో అటు, ఇటు ఏ పార్టీకి చెంద‌కుండా అలానే ఉందిపోయింది. 


చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే ఆమెను టీడీపీ వాళ్లు ప‌ట్టించుకోలేదు. ఆమె టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత రూటు మార్చి బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక‌, కొన్నాళ్ల కింద‌ట బీజేపీలో చేరేందుకు రెడీ అయింది. అయితే, ఇప్పుడు ఏపీలో బీజేపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైన నేప‌థ్యంలో.. ఆ పార్టీలోకి వెళ్లే విష‌యాన్ని కూడా ఆమె ప‌క్క‌న పెట్టేసింది. ఈ నేప‌థ్యంలో ఆమె త్వ‌ర‌లోనే కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్టు మీడియా వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే, ఈ వ్యూహం వెనుక బీజేపీ ఉంద‌నేది మ‌రో క‌థ‌నం. 


ఆమె ఎస్టీ వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఎస్టీ వ‌ర్గాలు మ‌ద్ద‌తు ప‌లికే అవ‌కాశం ఉంద‌ని ఆమె భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఎస్సీ, ఎస్టీల ఓట్ల‌ను చీల్చ‌డం ద్వారా ఆమె త‌న పారర్టీ నేత‌ల‌ను గెలిపించుకుంటే.. అనంత‌రం బీజేపీలో స‌ద‌రు పార్టీని విలీనం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం మొత్తంగా రాష్ట్రంలో చంద్ర‌బాబును దెబ్బ‌తీసేందుకునేన‌ని అంటున్నారు. అయితే, తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు, పార్టీ అధినేతల‌ను లెక్క‌చేయ‌ని త‌నం వంటివి గీత‌కు మైన‌స్‌గా మారాయి.  


ఆమెకు ఏ వర్గంలోనూ… చివరికి ఎస్టీల్లోనూ పలుకుబడి లేదు. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌పైనే మొన్నటిదాకా వివాదం వడిచింది. ఇక హైదరాబాద్‌లో ఆమె ఆర్డీవోగా పని చేస్తున్నప్పుడు శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల భూమిని భర్తకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టింది. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసేసుకుంది. ఇక ఆమె భర్తపై అనేక మోసం కేసులున్నాయి. చివరికి కొత్తపల్లి గీతపై కూడా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఆమె పార్టీ పెడితే... ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా? క‌నీసం డిపాజిట్లు అయినా వెన‌క్కి వ‌స్తాయా? అనేది ఆలోచించుకోవాల్సిన విష‌యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: