పాశ్చాత్య నాగరికతలో అధర చుంబనం సర్వసాధారణం.  ఇక బాలీవుడ్ చిత్రాల్లో అయితే లిప్ లాక్ సీన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారతీయ చలన చిత్రాల్లో కూడా లిప్ లాక్ సీన్లు తప్పని సరి అయ్యాయి.  ఇదిలా ఉంటే 73 ఏళ్ల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యటెర్టె తన చేష్టలతో మరోమారు విమర్శల పాలయ్యారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఆయన ఆదివారం పర్యటించారు. అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపై ఇద్దరు ఫిలిప్పీన్‌ మహిళలను రోడ్రిగో పిలిచారు.
Image result for filipino president kiss
ఇద్దరికీ చెరో పుస్తకం ఇచ్చారు. వేలాదిమంది ఎదుట ఓ వివాహితతో స్టేజిపైనే పెదాలపై ముద్దు పెట్టించుకున్నారు.  దాంతో అందరూ ఒక్కసారే షాక్ కి గురయ్యారు.  ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలను డ్యుటెర్టె కొట్టి పడేశారు. మద్దతుదారులను ఉత్సాహపరచడానికే అలా చేసినట్టు చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో పర్యటించిన ఆయన తన మద్దతుదారులతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతను స్టేజిపైకి పిలిచిన ఆయన ఓ మహిళ చేతిలో పుస్తకం పెట్టారు.

ఆ తర్వాత ఆయన తన పెదవులపై ముద్దు పెట్టాలని మహిళలను కోరారు..దాంతో ఆమె షాక్ కి గురైంది. తర్వాత నవ్వాపుకోలేకపోయారు పడీపడీ నవ్వారు. కానీ అధ్యక్షులు వారు మాత్రం ముద్దు పెట్టాల్సింతే అన్నట్లు అడగడంతో తప్పని సరియై ఆమె ముద్దు పెట్టి అధ్యక్షుడి కోరిక తీర్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ టీవీ చానెల్ లైవ్ ప్రసారం చేయడంతో అధ్యక్షుడి కిస్ వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: