కర్ణాటకే మొత్తం నాటకంగా మారింది. ఇప్పుడు ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన తరవాత ఇంతవరకు మంత్రివర్గ కూర్పు  జరగలేదు. సంకీర్ణంలోని భాగస్వముల మద్య పదవుల పంపకం విషయంలో ప్రతిష్ఠంబన తెలిసిందే. తన కేబినెట్ ను కుమారస్వామి రేపు మధ్యాహ్నం 2 గంటలకు విస్తరించనున్నారు. ఇరు పార్టీల్లో మంత్రిపదవులు ఆశించేవారి సంఖ్య ఈ సారి ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో పార్టీ అధినేతలకు పదవుల పంపకం పెద్ద సంకటంగా మారింది
Image result for karnataka cabinet tomorrow
జూన్ 1న జరిగిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. హోమ్, ఇరిగేషన్, హెల్త్, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం మొదలైన  శాఖలు కాంగ్రెస్ కు దక్కనున్నాయి.  ఫైనాన్స్, ఎక్సైజ్, పబ్లిక్ వర్క్, విద్య, టూరిజం, రవాణా శాఖలను తీసుకోవడానికి జేడీఎస్ సమ్మతించింది.
Image result for karnataka cabinet tomorrow
అయితే, మంత్రి పదవుల కోసం జేడీఎస్ ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. జేడీఎస్ కు తక్కువ మంత్రి పదవులు ఉండటంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి మాట్లాడుతూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని చెప్పారు. రేపు జరగనున్న తొలిదశ కేబినెట్ విస్తరణలో జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఎనిమిది నుంచి తొమ్మిది మందిని కేబినెట్ లోకి తీసుకుంటామని, మరో రెండు, మూడు పదవులు ఖాళీగా ఉంటాయని చెప్పారు.
Related image
పదవులను ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో తమ అధినేత దేవేగౌడకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు. ఎమ్మెల్యేలు అందరు కేబినెట్ కు సహకరించాలని దేవేగౌడ ఈ రోజు జరిగిన పార్టీ సమావేశంలోలో స్పష్టం చేశారని చెప్పారు.

Image result for karnataka secretariat building

మరింత సమాచారం తెలుసుకోండి: