నారా చంద్రబాబు నాయుడు ఒక వెటరన్  పొలిటీషియన్. నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయానుభవంతో కరుడుగట్టిన రాజకీయవాది. కంటిన్యూగా రాజకీయ పడిగట్టు పదాలు వాడితూ పాలన పడాకున పడేసి తన ప్రభుత్వంపై తానే ధర్మ పోరాటాలు, నవనిర్మాణ దీక్షలు చేస్తూ ఒక సంవత్సర కాలాన్ని అంటే ఎన్నికల వరకు గడిపేయ బోతున్నారు.

Image result for prime minister post offered to chandrea babu

ఆయన తరచూ చెప్పేమాట ప్రధాని పదవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో త్యాగం చేశానని అనటం అదె మాటను లంఖించుకొని ఆయనపుత్రుడు ప్రజల చేత ఎన్నుకోబడని లోకేష్ పదేపదే వాళ్ల నాన్న త్యాగమని - అలాగే తాను కూడా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినట్లు కూడా చెప్తున్నారు. అసలు ఈ తండ్రికి ప్రధాని పదవి, కొడుకుకు ముఖ్యమంత్రి పదవి ఎవరూ ఆఫర్ చేసిన దాఖలాలు చరిత్రలో లేనే లేవు.

Image result for sacrificing nature of chandrababu Lokesh

అయినా ఆరుకోట్ల ప్రజలున్న ఆంధ్రప్రదెశ్ లోకేష్ లాంటి ముఖ్యమంత్రి పదవికి అర్హత కలిగిన పోటీదారులు అరవై లక్షలమందైనా ఉంటారు. ఆయన అవసరం ఎవరికీ లేదు ఆయన ఏపి రాజకీయాలకు ఒక గుడిబండ. అలాగే చంద్రబాబు లాంటి ప్రధాని పదవిని అలంకరించగల సమర్ధులు దేస వ్యాప్తంగా ఒక కోటి మందైనా ఉంటారు. వీళ్ళు త్యాగం చేయలేదు. త్యాగం చేయగల గుణం వీరికి లేనే లేదు. కస్టార్జితంగాని పదవి లో ప్రమాణాలు మరచి పదే పదే గోబెల్ సూక్తులు చెపితే జనం ముందు పరాచికాలపాలై పడే కొన్ని ఓట్లైనా ఇప్పుడు పదకుండా పోవచ్చు.

Image result for sacrificing nature of chandrababu Lokesh

ఇక ఒక సంవత్సర కాలం బిజెపి తో స్నేహం చేస్తూ శాసనసభనుండి ప్రతిపక్షాన్ని బయటికి తరిమేసి సభను బొందపెట్టి కొనకాలం ప్రత్యెక హోదా అని, మరికొంతకాలం ప్రత్యేక్ హోదా సంజీవని కాదంటూ ప్రత్యేక పాకేజీ నెట్టిన పెట్టుకొని ఈ లోగా కేంద్రప్రభుత్వ నిధులపై లెక్ఖలు జెప్పకుండా కుప్పిగంతులేసి నాలుగు సంవత్సరాలు దుబారా వ్యాయాలు చేస్తూ నాలుగులక్షల ఉద్ద్యోగాలిచ్చినట్లు 20లక్షలకోట్లు పెట్టుబడులు వచ్చినట్లు శుష్క వాక్కులు పలకటం రాష్ట్రానికి ధారుణ అన్యాయం చేయటమే.

Image result for prime minister post offered to chandrea babu

జనసేన పవన్ కళ్యాణ్ ప్రజల్లొకి వెళ్ళి ప్రచారం చేసుకున్నా, వైసిపి జగన్ సంకల్పయాత్రలు చేసినా వాళ్లు ప్రతిపక్షాలు పాలన బాధ్యత వారికి లేదు. ముఖ్యమంత్రిగా తాను పార్టీ కోసం రకరకాల దీక్షలు చేస్తూ ఊరిమీదపడితే ఆంధ్రప్రదేశ్ పాలన శంకరగిరిమాన్యాలు పట్తిపోతుంది. నేను నాకు, అంటూ మనవణ్ని చూసుకునే సమయం కూడా త్యాగం చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం దాన్ని కొన్ని ప్రజాహితం కోరని కుల పత్రికలు వేనోళ్ళ పొగటం ప్రజలకు అసహ్యం కలిగిస్తున్నాయి. రాష్ట్రం లో పని చేసే ఉద్యోగులంతా కూడా తమ పిల్లలను పెళ్ళాలను ఇతర కుటుంబ సభ్యులను చూసుకొనే సమయం దొరకట్లేదని అంటు న్నారు. కారణం అర్ధాంతరంగా ఓటుకు నోటు కేసు తో అర్ధరాత్రి హైదరాబాద్ వదలి అమరావతి పారిపోయి రావటమె. అసలు అంత అర్ధాంతరంగా పదేళ్ళ పాటు వినియోగించుకోవలసిన రాజధానిని వదలి రావటానికి కారణం ఇంతవరకు చంద్రబాబు ప్రజలకు చెప్పలేదు. 

Image result for sacrificing nature of chandrababu Lokesh

చివరికి లోకేష్ కూడా త్యాగంచేస్తున్నట్లు మాట్లాడుతుంటే జనం నోటితో నవ్వలేక దేనితోనో నవ్వల్సిన పర్స్థితులు రోజు రోజుకి దాపురిస్తున్నాయి రాష్ట్రంలో. కులప్రాంత పాలన కూడా సవ్యంగా సాగించకుండా ఊళ్ళుబట్టి పోయిన విపక్షనేతను నిందిస్తూ, కేంద్రాన్ని వినియోగించుకొని ప్రయోజనాలు సాధించుకోవలసిన తన బాధ్యతను వదిలేసి "యిచ్చిన వాడినో, యిచ్చే వాడినో, ఇవ్వవలసిన వాడినో చచ్చేట్లు తిడుతూ" ఏకంగా ఒక సంవత్సరం మటాష్ చేసే నారా వారిది కూడా త్యాగమైతే - ఉత్త పుణ్యాని కి చింతమనేని దెబ్బకు బలైన రెవెన్యూ ఉద్యోగి వనజాక్షిది ఇంకెంత పెద్ద త్యాగమో? చెప్పాల్సింది ఆ నారా తండ్రీ కొడుకులే.

Image result for prime minister post offered to chandrea babu

ఓటుకు నోటు స్కాములో నిండా ప్రజాభిమానాన్ని కోల్పోయి వీదుల్లో పడ్డ ముఖ్యమంత్రి మెడకు ఎయిర్ ఏషియా స్కాం చుట్టుకోగా - కనీసం తను, తన కుమారుడు, తన పంచమాంగ దళాలు ఏమాత్రం ఇప్పుడు అవినీతి పరుడని లక్షల కోట్లు దొబ్బేశాడని అంటూ ఐదేళ్ళు గడిపిన ఆయన, ఇప్పుడే ముఖంతో ప్రతిపక్ష నేతను నిందిస్తారో? ఆయన ఆయన కుమారుడు ఆయన వందిమాగధులే చెప్పాలి. 

Image result for chandra babu sacrificed Prime minister post Lokesh chief minister post

ముఖ్యంగా నారా వాళ్లంటే ఆంధ్రులకు అసహ్యం మొదలైంది దీనికి ప్రధాన కారణం "నేనేసి రోడ్లపై, నేను ఇచ్చిన కరంట్ వాడుతూ" అనే మాట్లాడుతూ ప్రజలని బిచ్చ గాళ్ళు చేస్తున్న తంద్రి కొడుకులు ఎన్నికల తర్వాత పుట్టగతులు లేకుండా కొట్టుకు పోతారని అంటున్నారు ప్రజలంతా ముక్తకంఠంతో. అదే నిరూపిస్తుంది ప్రజల వెల్లువ తో నిండి పొంగిపొర్లు తున్న పవన్-జగన్ సభలకు విస్త్రుతంగా కదలి వస్తున్న జనవాహిని. అంతేకాదు అధికారం హంగూ పొంగున్న నారవారి సభలు జనం లేకుండా నిర్వీర్యమవటం గమనించైనా నారా ద్వయం తమ పద్దతి మార్చుకుంటే మంచిది. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముతో మౌలిక వసతులు కలిపిస్తారు. నారా వారి ఇంటి సొమ్ము పైసా కూడా ఖర్చు చేయలేది కదా! కుండా అంతా తాము దానధర్మాలు చేసి ప్రజలను బ్రతికిస్తున్నట్లు మాట్లాడటమే పెద్ద దుర్మార్గం.     

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: