ప్రకాష్ రాజ్ కు ఇప్పుడు ఙ్జానోదయం అయినట్లుంది. నాడు బిజెపిని తీర్పారబట్టిన ఈ మహోన్నత  ఙ్జానికి నేడు కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణం ఇంతవరకు అంటే కుమార స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల తరవాత కూడా కాబినెట్ కూర్పు పూర్తి చేయలేదు. సరే చివరకు ఎలాగోలా ఆ పని పూర్తి చేసినా తాజాగా 12 మంది కాంగ్రెస్ మంత్రులు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చెసేశారు.


ప్రకాష్ రాజ్ బిజెపిని దూషించి సాధించిందేనిటి? కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణాన్ని ప్రొత్సహించి పొడిచేసిందేమిటి? అని ఆయన నిర్వాకాన్ని గమనించిన వారు అడుగుతున్న ప్రశ్న. 

Image result for prakash raj comments on bjp

కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలపై విమర్శలు గుప్పించిన ఆయన, నేతల తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


"కర్ణాటక రాజకీయాలు! అప్పుడు ఒక పార్టీ (బీజేపీ) డబ్బు, అధికారంతో లాబీయింగ్‌కు ప్రయత్నించింది. ఇప్పుడు  మీరు (కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ నేతలు) మంత్రిత్వ పదవుల తో లాబీయింగ్ చేస్తున్నారు. రెండు మార్గాల్లోనూ మీరందరూ మిమ్మల్ని మీరు అమ్ముకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత కాలం మీరు ప్రజలను పిచ్చివాళ్లను చేస్తారు? ఇక మీరు పరిపాలన ప్రారంభించేది ఎప్పుడు?" అని ప్రకాష్ రాజ్ నిలదీశారు.

Image result for new prakash raj doubts on Congress-Jds coalition

బల నిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం కూడా ప్రకాశ్ రాజ్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలే చేశారు. "ఆట మొదలవ్వకుండానే ముగిసింది" అంటూ యడ్యూరప్ప రాజీనామా, కర్ణాటక రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు.


కర్ణాటకకు కాషాయరంగు అంటుకోలేదు. కానీ రంగులమయంగానే కొనసాగబోతోంది. ఆట మొదలవ్వకుండానే ముగిసింది. ప్రియమైన ప్రజలారా! మురికి రాజకీయాల కోసం సిద్ధం కండి. అలాగే ప్రజల కోసం నిలబడతాను అంటూ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈయనేం చేయగలరు?

 Image result for new prakash raj doubts on Congress-Jds coalition

రేపు ప్రజలు అడిగితే ప్రజలకు కనబడ కుండా బురద పూసుకోవాల్సిందే. అందుకే కాంగ్రెస్ కంపులో కాలు పెడితే ఫినిష్! ప్లీజ్ అండర్-స్టాండ్ రాజ్! ప్రకాష్ రాజ్!

మరింత సమాచారం తెలుసుకోండి: