సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు సమాజవాదీ పార్టీ నాయకుడు, ప్రఖ్యాత మూలాయం సింగ్ యాదవ్ తనయుడు, ఉత్తరప్రదేశ్ మాజీ యువ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లక్నో లోని ప్రభుత్వ బంగళాను  (# 4 విక్రమాధిత్య మార్గ్)  ఖాళీ చేశారు. కాని ఆ విలాసవంతమైన బంగ్లాను బాగా డామేజీ చేసి వెళ్లారట. శుక్రవారం రాత్రి ఆయన మనుషులు ఆ రాష్ట్ర ఎస్టేట్ అదికారులకు మాజీ ముఖ్యమంత్రి అధికార నివాసం  బంగళా తాళం అందచేశారు. శనివారం ఉదయం ఎస్టేట్ సీనియర్ అధికారి యోగేష్ కుమార్ శుక్లా బంగళాను ఇన్వెంటరీ సరిచూసుకోవటానికి  సందర్శించారు.
Image result for akhilesh vacated handed over the house damaged condition
ఆ విలాసవంతమైన బంగళా ఉన్న స్థితి చూసి ఆయన తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారట. బంగళా అంతటిని చిందర వందర చేశారట. ఈ బంగళాను అఖిలేష్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నలభై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనంతో స్వయంగా ఆదునీకరించుకున్నారట.  

Image result for akhilesh vacated handed over the house damaged condition

ఆ సమయంలో వేసిన సైకిల్ ట్రాక్ ను ఇప్పుడు తవ్వేశారట. ట్రాక్ లో ఉన్న విదేశీ ఇటుకలను తరలించుకు పోయారట. స్విమ్మింగ్ పూల్ లోని మార్బుల్, అలాగే కొన్ని గదులలో ఉన్న ఇటాలియన్ మార్బుల్, ఫ్లోర్ టైల్స్ తీసుకుపోయారు. ఎసిలు, కేంద్రీకృత సమసీతోష్ణ స్థితి ఏర్పాటుకోసం నిర్మించిన డక్టులను, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు లను,  తలుపులు తదితర వస్తువులను కూడా తరలించుకు పోయారట.

akhilesh house

Air-conditioning ducts missing at the bungalow in Lucknow vacated by Akhilesh Yadav

దీనిపై అఖిలేష్ యాదవ్ కు ఎస్టేట్ నిర్వహణ విభాగం లీగల్ నోటీసులు అనుకుంటున్నట్లు, అంతే కాదు అత్యంత ధారుణ డామేజ్ కు  నష్టానికి కారణ ఏమిటనేదానికి సంజాయిషీ కోరటానికి  న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని అదికారులు చెబుతున్నారు. ఆ డామేజ్ చూస్తే  అఖిలేష్  ఎంత  ఫ్రష్ట్రేషన్ లో ఉన్నారో తెలుస్తుందని బిజెపి అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాటి  పిటీఐ వార్తా సంస్థకు తెలిపారు. విజన్ మీడియాను ఆ బంగళాలోనికి అనుమతించారు కూడా


అయితే అఖిలేష్ ఇదంతా బిజెపి కావాలని చేస్తున్న ప్రచారం అని, తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని అన్నారు. తనకు చెందిన మొక్కలు అక్కడ వదిలివేశానని అంటున్నారు.

Image result for akhilesh vacated handed over the house damaged condition

మరింత సమాచారం తెలుసుకోండి: