ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ ల కీలక భేటీ సింగపూర్ లోని కేపెల్లా హోటల్‌ లో ముగిసింది. సుమారు గంటన్నర పాటు వీరిద్దరి మధ్యా చర్చలు సాగగా, అణ్వాయుధాలను వీడాలన్న డిమాండ్ పైనే ప్రధానంగా ట్రంప్ మాట్లాడినట్టు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే..ఈ ఇద్దరు అధ్యక్షులకు లాంగ్వేజ్ ప్రాబ్లం..ఎందుకంటే ట్రంప్ కి కొరియా రాదు..కీమ్స్ కి సరిగా ఇంగ్లీష్ రాదు.  దాంతో   వీరిద్దరూ ఈ ఉదయం సింగపూర్ లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తూ, తమ మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. 

ఇక ఒకరు మాట్లాడిన మాటలు మరొకరికి తెలిపేందుకు దుబాసీలను (అనువాదకులు) ఇరు దేశాలూ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాయి. ఇంగ్లీష్, కొరియన్ భాషలు తెలిసిన అనువాదకులు కిమ్, ట్రంప్ మాట్లాడిన మాటలు ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కిమ్, అసలు ఇంతవరకూ రావడమే చాలా గొప్ప విషయమని, ఎన్నో అడ్డంకులను అధిగమించిన తరువాత ఈ రోజు వచ్చిందని అన్నారని తెలుస్తోంది.

ఇక ఈ భేటీ అనంతరం ట్రంప్ స్పందిస్తూ, సహృద్భావ వాతావరణంలో కిమ్ తో చర్చలు సాగినట్టు వెల్లడించారు. ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ పెద్ద సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో తామిరువురమూ కలిశామని, కిమ్ తో ఏకాంతంగా జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయనే నమ్ముతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: