Image result for modi govt achievements
కేంద్రంలో 2014 లో ఏర్పడ్ద నరెంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలకేమి చేసింది? దాదాపు నాలుగేళ్ళు గడచిపోయి ఐదో సంవత్సరం లోకి ప్రవేసించిన దరిమిలా రాజకీయ కారణాలను కాసేపు వదిలేసి అసలు మనకు కనిపించే ఏఏ ప్రయోజనాలను వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా ఒనగూర్చిందనేది తరచిచూస్తే కొన్నిటితో ఈ క్రింది జాబితా తయారైంది. ఇక్కడ రాజకీయ కార్యా కారణాలను అసలు లెక్కలోకే తీసుకోలేదు. పౌరుల వ్యక్తిగత ప్రయోజనాల సాధన బాధ్యత ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ స్వీకరించదు.   

Image result for modi govt achievements

* 300 మిలియన్ బ్యాంకు అకౌంట్లు తెరిపించింది. 
* 120 మిలియన్ ప్రజలకు సురక్షా బీమా కల్పించింది.
*4 కోట్ల ప్రజలకు ‘జీవన జ్యోతి బీమా’ - 37 మిలియన్ ప్రజలను ‘అటల్ పెన్షన్ యోజన’ కల్పించింది.
* మనల్ని దొంగదెబ్బ తీసిన పాకిస్థాన్ కు సర్జికల్ స్ట్రైక్ తో గట్టి సమాధానం చెప్పింది.  
*జిఎస్టీ ద్వారా ఆదాయపన్ను పరిధి పెరిగి ‘టాక్స్ రిటర్న్స్’ బాగా పెరిగాయి

Image result for modi govt achievements

*నోట్ల రద్దు తర్వాత  దాదాపు 98% డబ్బు తిరిగి వ్యవస్థలోకి వచ్చింది. (తొదరపాటుతనంతో కొంత  పరిపూర్ణత రాలేదు)
* ప్రపంచంలోనే అతి పెద్దదైన ‘ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్’ కు శ్రీకారం చుట్టింది.
* దారిద్ర రేఖకు దిగువన వున్న 12 కోట్ల కుటుంబాలకు ‘గ్యాస్ కనెక్షన్’ లను ఉచితంగా పంపిణి 
*స్వాతంత్ర్యం నాటి నుంచి కూడా చీకట్లో మగ్గుతున్న 19వేల గ్రామాలకు విద్యుధీకరణతో వెలుగులు నింపింది.   
*అమెరికా పాకిస్థాన్ కు చేసే సాయాన్ని నిలిపివేసింది. 

Image result for modi govt achievements

*కుల్ భూషణ్ జాదవ్ కేసు లో అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ ను ఓడించాం
*జపాన్ భాగస్వామ్యంతో త్వరలో మనదేశంలో ‘బుల్లెట్ ట్రైన్స్’ ను ప్రవేశ పెట్టబోతున్నాం 
*ముద్రా లోఋణాల సహాయంతో 10కోట్ల మంది నిరోద్యోగ యువతకు పనులు కలిపించింది.
*విజయవంతంగా ‘సార్క్ సాటిలైట్’ తో పాటు ‘కార్డోశాట్ ప్రయోగాలు’ చేపట్టి ప్రపంచం మొత్తం మనల్ని చూసెటట్టు  చేసాం
*4కోట్ల ప్రజలకు ‘మిషన్ ఇంద్రధనుష్’ ద్వారా టీకాలు ఇప్పించి రోగాల బారి పడకుండా కాపాడింది. 

Image result for modi govt achievements

*అధిక మొత్తంలో విదేశీ పెట్టుబడి దారులు పెట్టుబడులు పెట్టారు 
*హజ్ సబ్సిడీని నిలిపివేశాం 
*ముస్లిం మహిళల పాలిట శాపంగా మారిన త్రిపుల్ తలాఖ్, నిఖా హలాలను రద్దు చేసే నిర్ణయం 
*బినామీ చట్టం తీసుకొచ్చి – రియల్ ఎస్టేట్ ను నియంత్రణ కోసం ‘రెరా యాక్ట్’ తెచ్చింది.
*మొదటిసారి భారత్, యూకేను బీట్ చేసి 6వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది 

Image result for modi govt achievements

*రక్షణ బడ్జెట్ ను 11%కి పెంచగలిగింది. 
*34,000 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చగలిగాం 
*వీఇపి కల్చర్ కు చిహ్నమైన ‘రెడ్-బీప్’ ను నిరోదించింది. 
*పెద్ద ఎత్తున హైవే ప్రాజెక్ట్ లను ప్రారంభించింది పూర్తిచేసింది. 
*2022 వరకు ‘విద్యుత్ కనెక్షన్’ లేని ఇళ్లకు ఉచిత విధ్యుత్ ఇవ్వాలనే కృతనిశ్చయం చేసింది. 

Image result for modi govt achievements

*’ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో 30వ స్థానానికి చేరుకున్నాం. 
*నిరుద్యోగ యువత శిక్షణ కోసం 100 ‘స్కిల్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్’ లను ప్రారంభించింది. 
Image result for modi govt achievements

ఇంతా మన దేశ ఓటరు మహాశయులు చాలా స్వార్థపరులు. వాళ్లకి కావాల్సిందల్లా వారికి ఏమైనా వ్యక్తిగత ప్రయోజనం కలిగిందా? అనేదే ముఖ్యంగా ఆలోచిస్తారు. కానీ దేశం గురించి ఆలోచించే సమయమే లేదు. ఇందులో మరికొందరు "ఉచిత ఎలక్ట్రిసిటీ,  ఉచిత వైఫై,  ఉచిత భోజనం, ఉచిత రవాణా, ఉచిత సుఖసౌఖ్యం...." ఇస్తే దావూద్ ఇబ్రహీం లాంటి దేశద్రోహులకైనా ఓటేసినా ఆశ్యర్యపోవలసిన  అవసరం లేదు. 


మన వాళ్లకు ఉన్నత స్థాయి సౌఖర్యాలు కావాలి - కానీ చట్ట ప్రకారం పన్నులు కట్టమంటే కట్టరు.  అదే విదేశాల్లో ఉంటే మాత్రం ఉత్తమ పౌరులుగా రాణిస్తారు. మన దేశం పరిశుభ్రంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఎవరు ‘డస్ట్-బిన్’ లను వినియోగించరు. అదే విదేశాల్లో వీరే చిత్త శుద్దితో పని చేస్తారు.  మనం ‘అవినీతి రహిత సమాజం’ కావాలని కోరుకుంటాం. కానీ ఎక్కడైనా వెళితే! ఎక్కడైనా కొంత నిరీక్షించవలసి వచ్చినా!  'క్యూలైన్లో' నిలబడాల్సి వచ్చినా దాన్ని అధిగమించటానికి  “అవినీతి ప్రోత్సహిస్తాం” అలా మన పనులను చేయించుకుంటాం. అదే మన అభిమాన హీరోనో, క్రికెట్ ప్లేయరునో, చూడటం కోసం గుంపులో ఒకరి పైకి మరొకరెక్కి క్రిక్కిరిన మందలో కూడా గంటలు గంటలు నిరీక్షిస్తాం అదీ ఓపికగా.

కాని ప్రయాణములో ‘ట్రాఫిక్ లో గ్రీన్ సిగ్నల్’ వచ్చే వరకైనా ఓపిక ఉండదు. ప్రభుత్వం పటిష్టంగా - స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలని అంటాం. కానీ మనమే ‘ఆ రూల్స్ ను బ్రేక్ చేయటం’ లో ముందుంటాం.  మనవాళ్లు కొంచెమైనా కష్టపడకుండా ప్రభుత్వమే అన్నిపనులు, అతి సునాయాసంగా చేసి పెట్టాలంటాం. మన వ్యక్తిగత బాధ్యతలను కూడా  ప్రభుత్వమే భరించాలని కోరుకుంటాం.  మన వ్యక్తిగత బాధ్యతను (సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ) మరిచిపోతాం. ఇది మనదేశ ప్రజల సారీ ఓటర్ల మనోగతం.


నోట్ల రద్ధు సమయంలో నిరుపేదలన్న వారంతా రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, చీకటి సంపాధన పరుల సొమ్మును రక్షణ కవచంగా నిలబడి కాపాడిపెట్టి “నోట్ల రద్ధు” అనే మహాయఙ్జాన్ని నిర్వీర్యం చేశారు. ఇక్కడ ప్రభుత్వ నిర్వహణా వైఫల్యం ఉంది కాని చిత్తశుద్ధిని శంఖించలేము.  ప్రియమైన భారత ఓటర్లు! ఒక్కసారి స్వార్థం విడిచి దేశం కోసం ఆలోచిద్దాం.

Image result for modi govt achievements

నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతివ్యక్తి ఖాతాలో ₹15 లక్షలు వేస్తే ఇంకేమైనా ఉందా? దెశప్రజల రక్తనాళాల్లో ప్రవహించేది నాటు సారా, సోమరి తనం, ఇంకా అనేక అనాచారాలు తప్ప వ్యక్తిగత బాధ్యత పాటించని వారికి ఎంతిచ్చినా ఏమిచ్చినా నిష్ప్రయోజనమే. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సింది విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు పెంపు లాంతివి తప్ప ఋణాల రద్ధు, ఉచిత సౌకర్యాలు కాదు. ప్రజలను వారి జీవన ప్రమాణాలను పెంచుకొనే సామాజిక (వ్యక్తిగతంగా కాదు) సామర్ధ్యాన్ని సంపాధించుకొనే అవకాశాలు మాత్రమే.   

మరింత సమాచారం తెలుసుకోండి: