మన రాజకీయ నాయకులపై ప్రజాప్రతినిధులపై ఎన్నికలప్పుడైనా మనం ఒక కన్నేయాలి. హైదరాబాదీయులకు జి వివేక్ గుఱించి తెలియనిదేమీ లేదు. ఆయన ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ లో ఉండి, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కాగానే అధికార టిఆరెస్ లోకి దూకేశారు. తనకు రక్షణగా దళీత కార్డ్ ఉండనే ఉంది. ఆయన స్వార్ధ పరత్వాన్ని టిఆరెస్ అధినేత బలపరచారు.

Image result for HCA & G Vinod

ప్రభుత్వ సలహాదారుగా ప్రయోజనాలు అనుభవిస్తూ 'హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్-హెచ్‌సీఏ' అధ్యక్ష పదవి నుంచి ప్రయోజనాలు పొందుతూ హాయి గా ఒక ప్రక్క ఇతరులు ఎదవరైనా ప్రశ్నిస్తే దళిత కార్ద్ అడ్డు కవచంగా పెట్టుకొని వారితో పోరాడుతారు. మరోప్రక్క జోడు పదవులు. ఇక జీవితమంతా ఎంజాయిమెంట్ మాత్రమే. కనీసం మరో దళితునిలో మైనారిటీ వ్యక్తికో హెచ్సిఏ పదవిని వదిలేయలేదు.సర్వం తనకే కావాలి. అందుకే అన్యాయం ఓడింది న్యాయం గెలిచిందని ప్రజలు కొంతైనా హైకోర్ట్ నిర్ణయాన్ని ప్రస్తుతిస్తున్నారు.     

Image result for high court HCA

అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్ ఎన్నిక చెల్లదంటూ 'అంబుడ్స్‌మన్‌ ' (చట్టం అధారంగా సమస్యల పరిష్కర్త) ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా పునర్విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు తాజా ఉత్తర్వులతో వివేక్ మరో సారి పదవి కోల్పోనున్నారు.


హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ పై వివేక్ గెలుపొందారు. అయితే వివేక్ 'ప్రభుత్వ సలహాదారుడూగా ఉంటూ హెచ్సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్దమంటూ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్‌ వివేక్ ఎన్నిక చెల్లదని తేల్చిచెప్పింది.


అంబుడ్స్‌మన్‌ నిర్ణయంతో పదవి కోల్పోయిన వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి అంబుడ్స్‌మన్‌ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివేక్‌కు ఊరట కలిగింది. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ ధర్మాసనం ఎదుట అప్పీలు దాఖలు చేశారు. అజారుద్దీన్ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది.

Image result for HCA & G Vinod

దీనిపై తాజాగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని ఆదేశించారు. ధర్మాసనం తాజా ఉత్తర్వులతో అంబుడ్స్‌మన్‌ నిర్ణయం అమలులోకి వచ్చినందున వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు.


హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌ 'జోడుపదవులు' అంశంపై హై-కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అజారుద్దిన్ తెలిపారు. ఈ తీర్పుతో వివేక్ కు వ్యతిరేకంగా తమ ప్యానెల్ చేస్తున్న న్యాయ పోరాటం గెలిచినట్లు భావిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఎట్టకేలకు హెచ్‌సీఏ లో న్యాయమే గెలిచిందని, ఇకపై ఏం జరగాలన్న దానిపై జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించి నిర్ణయిస్తామని అజారుద్దిన్ తెలిపారు.

Image result for HCA & G Vinod

మరింత సమాచారం తెలుసుకోండి: