రంజాన్ అనగానే భోజన ప్రియులకు ముందుగా గుర్తుకొచ్చేది ఘుమఘుమలాడే హలీం. రుచికరమైన, పౌష్టిక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ రంజాన్ స్పెషల్ డిష్‌కు హైదరాబాద్‌లో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అయితే నగరవాసులు ఈసారి మరింత అభిమానాన్ని కురిపించారు.  హైదరాబాద్‌లో టేస్టీఫుడ్ విషయంలో నగరవాసులు, సందర్శకుల మొదటి ఓటు సాధారణంగా హైదరాబాద్ బిర్యానీకే పడుతుంది. రంజాన్ మాసంలో మాత్రం అందరూ హలీంకే ఓటేస్తున్నారని స్విగ్గీ సంస్థ తెలిపింది.
Image result for హలీం
నగరవాసులు బిర్యానీ కంటే రుచికరమైన హలీంను టేస్ట్ చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని, నెల రోజులకు పైగా హలీం ఆర్డర్లే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.  కేవలం హైదరాబాద్ మాత్ర మే కాకుండా ఇతర మెట్రో నగరాల్లోనూ ప్రత్యేకంగా హలీంను అందించే రెస్టారెంట్ల వివరాల కోసం పరిశోధించారు. ఆన్‌లైన్ ఆర్డర్లలో ముఖ్యంగా టెకీలు ముందు వరుసలో ఉన్నారని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఈ రంజాన్ మాసంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యంలో 95 శాతం అమ్మకాలను ఇప్పటికే అధిగమించామని స్విగ్గీ తెలిపింది.

గత ఏడాది అమ్మకాలు 80 శాతంగా ఉన్నాయని, ఈసారి 15 శాతం ఎక్కువగా ఆర్డర్లు తీసుకున్నామని వెల్లడించింది. సాధారణ రోజుల్లో కంటే ఈ మాసం 80 శాతం వృద్ధి సాధించామని వెల్లడించింది.హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై వాసులు సైతం హైదరాబాద్ బ్రాండ్ హలీంను అధికంగా ఇష్టపడుతున్నారని వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: