Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 6:07 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: తప్పుచేసి బొక్కబోర్లా పడ్డ టిడిపి! ప్రజలకు టయిం వేష్ట్

ఎడిటోరియల్: తప్పుచేసి బొక్కబోర్లా పడ్డ టిడిపి!  ప్రజలకు టయిం వేష్ట్
ఎడిటోరియల్: తప్పుచేసి బొక్కబోర్లా పడ్డ టిడిపి! ప్రజలకు టయిం వేష్ట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అసలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేతలను కలిస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం పునాదులు కదిలినట్లు ఇంత కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముంది? ఇరువురు నేతలు రాజకీయంగా బద్దశత్రువులైనా కలిస్తే వెరే పక్షాలను వచ్చిన నష్ట మేమిటి? అని  కొందరు ప్రశ్నిస్తున్నారు. 


ఈ సందర్భంలో ప్రభుత్వ రికార్డుల్లో 27 అంకే క్వార్టర్ నంబరుగా దొంగచాటుగా ఎంటర్ చేసి మరీ, బుగ్గన రాజేంద్రనాథరెడ్డిపై బురద జల్లేంతగా టీడీపీ నేతలు దిగజారి తమ స్థాయిని అథఃపాతాళానికి పడిపోవడం అసలెందుకు? దీన్నిబట్టి, కుతంత్ర రాజకీయాలను తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన అవసరమేమిటి?  తెలుగుదేశం నాయకుల అంతరాంతరాళ్ళలో జలధరింపు ఎందుకో తెలియదు కానీ మొత్తంమీద వైసిపిపై, పవన్ కళ్యాణ్ జనసేనపై బురదజల్లే కార్యక్రమం ప్రారంభించారు. ఇది మొత్తానికి ముదిరి పాకాన పడింది. 
ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa
"… వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ కేంద్ర స్థాయి నేతలకు కలిశారని ప్రచారం చేశారు. బీజేపి–వైకాపా కలిసి పోతుందని ఒకరంటే… బుగ్గన, 'పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఛైర్మన్' గా ఉన్నారు కాబట్టి… ఆయన నుంచి బీజేపీ కేంద్ర నేతలు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాల ముఖ్య పత్రాలు తెప్పించుకున్నారని - ఇదంతా చంద్రబాబుపై జరుగుతున్న కుట్ర అని కంగారు పడుతూ కుంగిపోతున్నారు టీడీపీ నేతలు. 


అయితే సామాన్య ప్రజల్లో వినిపించే మాటలేమంటే "చంద్రబాబు గారు తాను నిజంగా "నిప్పు" అయితే ఎవరు ఏవిధమైన ఆరోపణలు చేసినా వచ్చే నష్ట మేమిటి? నిబద్ధత ఉన్న నాయకత్వంపై ఎవరెన్ని కుట్రలు రచించినా వచ్చే నష్టమేమిటో? చంద్రబాబే ప్రజలకు వివరించాలని అంటున్నారు. దీని కోసం రాష్ట్రంలో ఇంత ద్వని కాలుష్యం సృష్టించటం ఎందుకని? టెలివిజన్ చానళ్ళలో పత్రికల్లో ఇంత రసాభాస ఎందుకు?
ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa
ఈ క్రమంలో బుగ్గన రాజేంద్రనాథరెడ్దిపై బురద జల్లి, డిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఏదో కుట్ర? జరగబోతుంది అంటూ జనాలకు చూపించే ప్రయత్నంలో లాగ్-బుక్ లో దొంగతనంగా (27) ప్రత్యేకంగా రాయటం అంటే ప్రభుత్వ రికార్డ్ లను తారుమారు చేయటం లాంటి ప్రమాదకర నేఱం కూడా చేసి అందులో కూరుకుంది. తమ దిగజారుడు తనాన్ని టీడీపీ నేతలు బయట పెట్టుకుని మరీ ఇంకా మొత్తం తెలుగుదేశం వాళ్ళు యాగీ చేయటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.

ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa

వైసిపి-బిజెపి కలయిక అనేది ఇప్పుడు ....కలిస్తే ఏమిటి? వాళ్ళైనా విభజన ఫలాలను సాధించగలరేమో? అనే సానుకూల ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి. నాలుగేళ్ళు బిజేపితో మైత్రి నిర్వాకం చేసి కూడా ఏమీ చేయలేని టిడిపి కంటే తొలినుంచీ "ప్రత్యేక హోదా సాధనకోసం పోరాడే వైసిపి కనీసం ప్రత్యేక పాకేజీ సాధించినా రాష్ట్రం ప్రయోజనాలు పొందుతున్నట్లే కదా! ఈ సారి వైసిపికి అవకాసం ఇచ్చి చూద్ధాం" అని అనుకుంటున్నారు ఏపి ప్రజలు. ఆ అభిప్రాయమే జగన్మోహనరెడ్ది సంకల్పయాత్రల్లో ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంది, ప్రజల్లో బలపడుతుంది కూడా!

ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa
అయితే తాను టిడిపి అభియోగాలపై స్పష్టత ఇచ్చిన బుగ్గన, తాను ఏపీ భవన్ కు వెళ్లినమాట వాస్తవమని, ఆకుల సత్యనారాయణ తనకు వ్యక్తిగతంగా స్నేహితుడు కాబట్టి, ఆయనను కలిశానని, ఆయనతో పాటు సౌత్-ఎవెన్యూకి వెళ్లానని, అయితే అక్కడి సందర్శకుల రికార్ద్ లో సౌత్ ఎవెన్యూ అని రాసిన చోట తాను సంతకం చేస్తే, ఆతరవాత  27 అనే అంకె తర్వాత అక్కడ రాసినట్లు కనిపిస్తూనే ఉంది. తప్పుడు రికార్డులు సృష్టించి దాన్నే సాక్ష్యంగా అభియోగాలు చేస్తున్నారు. 


సౌత్-ఎవెన్యూలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు, అధికారుల నివాసాలు ఉంటాయని, తాను ప్రత్యేకంగా 27 సౌత్ ఎవెన్యూకి వెళ్లలేదని, తాను 27 ఎవెన్యూకి వెళ్లడం వల్ల బీజేపీనేత రాం మాదవ్ ని కలిసినట్లు రికార్డ్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో, అధికార టీడీపీ నేతలు చివరికి ఈ నేలబారు స్థాయికి  దిగజారిపోతూ, రాష్ట్ర ప్రతిష్ఠను భస్మీపటలం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa
పోనీ బుగ్గన రాం మాధవ్ ను కలిస్తే "ప్రజలకు జరిగే నష్టం ఏముంది?" ఎవరు ఎవరినైనా ఆఖరకు బద్దశత్రువులైన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ కలుసుకొని చర్చించుకున్న రోజులివి.
ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa

దెన్, వాట్ ఈజ్ రాంగ్ విత్ మిస్టర్ బుగ్గన మెట్ మిస్టర్ రాం మాధవ్?  అంటున్నారు ప్రజలు ముక్త కంఠంతో, .అయినా మాకెందుకీ ధ్వని కాలుష్యం ప్రతిరోజూ! అని కూడా అంటున్నారు. అయినా ఈ ప్రజాస్వామ్యంలో ఏవరైనా ఏవరినైనా కలవాలంటే టిడిపి అధినేత అనుమతి అవసరమా? ఎంత నియంతృత్వం? 
ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa
తనను రెండురోజుల కిందట వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారనే వార్తలపై స్పందించారు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌. అయన నన్ను కలవలేదని ఆ రూమర్లలో వాస్తవం లేదని స్పష్టం చేశారు రాంమాధవ్‌.  కాగా  రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్ కు వెళ్లారు ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అక్కడ ఉండటంతో ఇద్దరు కలిసి రాంమాధవ్‌ ను కలిశారని టీడీపీ ఆరోపించింది. ఇదిలావుంటే టీడీపీ నేతల ఆరోపణలను బుగ్గన ఖండించారు. రాష్ట్రంలో ఎవరు ఎవరిని కలవాలన్న నారా లోకేష్, టీడీపీ నేతల పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు.  
ap-news-tdp-shivers-buggana-met-akula-both-met-raa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!
ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్
భారత రాజ్యాంగం ఓరిజినల్ ఎక్కడ ఉందో తెలుసా?
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
About the author