Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 11, 2018 | Last Updated 12:47 am IST

Menu &Sections

Search

ప్రాంతీయ జాతీయ నాయకులను హిందూ గుళ్ళ చుట్టూ తిప్పిన నరెంద్ర మోడీ!

ప్రాంతీయ జాతీయ నాయకులను హిందూ గుళ్ళ చుట్టూ తిప్పిన నరెంద్ర మోడీ!
ప్రాంతీయ జాతీయ నాయకులను హిందూ గుళ్ళ చుట్టూ తిప్పిన నరెంద్ర మోడీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎవరెన్నన్నా ఎన్ని కథలు చెప్పినా ఇందిరా గాంధి ని మహాశక్తి  కాదని ఎవరూ అనలేరు. భారత ప్రధాని ఇందిరా గాంధి పేరు భారత మారుమూలలకు వినిపించింది. ఆ తరవాత ఆ స్థానాన్ని స్థాయిని చేరుకోవటమే కాదు అధిగమించింది నరెంద్ర మోడీనే. తనను ప్రజలచేత నమో అనిపించేశుకున్నారు కూడా! 
national-&-international-news-narendra-modi-vs-ind
విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నైనా ఉండవచ్చు. ప్రధానిగా నరేంద్ర మోడీది ప్రత్యేక యుగం ప్రత్యేక శకం. ఇందిరా గాంధి తర్వాత దేశంలో అంతటి జనాదరణ కలిగిన నేతగా చరిత్ర సృష్టించగలిగారు. “రైట్ వింగ్ పాలిటిక్స్” కు ఒక కొత్త మార్గ నిర్దేశనం చేశారు. ‘హిందూయిజం’ అంటే అంటరానితనం కనబరిచే పార్టీలకు గుండెలో దడ పుట్టించారు అనే కంటే చలి పుట్టించారు అంటే బాగుంటుందేమో?  


ముస్లిం, మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి పోటాపోటీలు పడే రాజకీయ పక్షాలకు నిద్రలో కూడా నక్షత్రాలు చూపించారు. గుళ్లు, గోపురాలు తిరుగుతూ తాము హిందూత్వ ఆచరణను హర్షిస్థామని ప్రదర్శించుకోక తప్పని అనివార్యతను కల్పించారు. ఇక ప్రాంతీయ పార్టీల నుండి జాతీయ పార్టీలవరకు మెజారిటీ హిందు వులను సైతం ఓట్ల కోసం ప్రతి తలుపు తట్టాల్సిందే గడప తొక్కాల్సిందే. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులను సాంప్రదాయక రాజకీయ పార్టీలన్నీ తొక్కేసి తమ పబ్బం గడుపుకుంటూ వస్తూన్నాయి ఏడు దశాబ్ధాలుగా. ఇప్పుడిక ఓట్ల కోసం ఇక హిందువుల గడప తొక్కక  తప్పని  పరిస్థితులు నెల కొనేలా చేశారు నరెంద్ర మోడీ. 

national-&-international-news-narendra-modi-vs-ind
రాజకీయ సిద్ధాంతం మొదలు ఆర్థికవ్యవస్థ వరకూ మోడీయిజం టు మోడీనామిక్స్ అనేలా సంపూర్ణ రూపాంతరం చెందిన ప్రత్యేక పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి.  నమో నాలుగేళ్ల పాలనలో నగుబాట్లకు తోడు నవనిర్మాణ సంకల్పమూ కనిపిస్తుంది. దృఢమైన నాయకత్వపటిమ దేశంలో ఏర్పడిందని దేశదేశాలకు చాటి చెప్పడంలో మోడీ కృతకృత్యులయ్యారు. దృఢమైన నాయకత్వం దేశానికెంత ఆత్మవిశ్వాసం ఇవ్వగలదో నమో ఋజువు చేశారు. 
national-&-international-news-narendra-modi-vs-ind
నల్లధనం పట్టుకోవాలి, అవినీతిని అరికట్టాలనే విషయంలో, నరెంద్ర మోడీ చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టలేరు. నోట్లరద్దు వంటి విషయాల్లో తొందరపాటు తనాన్ని ప్రదర్శించినా,  దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని ప్రజల్లో మెజార్టీ అర్థం చేసుకొన్నారు. ఈ కారణంగానే దేశంలో ప్రతిపక్షాలు రెచ్చిపోయినా ప్రజామద్దతు లభించలేదు సరికదా కనీసం నిరసనలు కూడా పెద్దగా వెల్లడి కాలేదు. రైతురుణమాఫీ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా డిమాండ్లు తలెత్తుతున్నప్పటికీ నరెంద్ర మోడీ సంయమనం, కొండొకచో ధృఢవైఖరి పాటించారు. దీనికి తల ఊపితే ఆర్థిక వ్యవస్థకు తప్పుడు సంకేతాలు వెళతాయనే భావించారు. ఈ డిమాండును బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఆయా రాష్ట్ర శాఖల కు మాత్రమే పరిమితం చేయగలిగారు. ప్రజాకర్షక విధానాల్లో సైతం కొత్త ఒరవడినే ప్రవేశపెట్టారు. సబ్సిడీలకు దాదాపు కోత పెట్టేశారు. గ్యాస్ రాయితీ లను క్రమేపీ ఎత్తి వేస్తూ ఇంతవరకూ గ్యాస్ వినియోగానికి నోచుకోనివారికి ఉచితంగా సిలిండర్లు అందచేశారు. ఇది నిజంగా హర్షించదగ్గ పథకమే. 
national-&-international-news-narendra-modi-vs-ind
డీజెల్ రేట్లను మార్కెట్ తో అనుసంధానం చేసేసి ఖజానాను నింపుకునే తెలివైన ఎత్తుగడతో ఆర్థిక పరి పుష్టిని సమకూర్చుకోగలిగారు. అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు తగ్గినా అది తెలియకుండా ప్రత్యేక సెస్పు లతో చాలాతెలివిగా కోశాగారాన్ని నింపేసుకున్నారు. ఈవిషయంలో విమర్శలు ఎంతగా తలెత్తినా ప్రజలు, ప్రతిపక్షాలు పోరాటం చేయలేని ఒక నిర్వీర్యమైన స్థితిని వారికి కల్పించగలిగారు. రోజు వారీ మార్పులతో పెంపుదలను గుర్తించలేని ఒక ఉదాసీన స్థితికి ప్రతిపక్షాలను నెట్టేశారు. జీఎస్టీ అమలు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఆర్థిక విషయాల్లో దీర్ఘకాల దృష్టి నరేంద్ర మోడీ పాలనలో కీలక పరిణామం.

national-&-international-news-narendra-modi-vs-ind
నరెంద్ర మోడీ స్వపక్షంలో విపక్షం దాగున్నా కూడా దేశంలో ఎదురు లేని రాజకీయాధిక్యాన్ని సాధించ గలిగారు. ఒకరకంగా చెప్పాలంటే అధ్యక్ష తరహా పాలన (ప్రెసిడెన్షియల్ డెమాక్రసీ మోడల్ ) కొనసాగు తోందనే చెప్పాలి. ఇంత స్వల్ప వ్యవధి లో ఏ ప్రధాని చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు. భారత్ అంటే ప్రతిదేశం ఆలోచనా విధానంలో సానుకూలత ప్రదర్శించ వలసిన అగత్యం తప్పని పరిస్థితిలోకి వారిని నెట్టేశారు. దేశంలో రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో విదేశాలకు “సానుకూల సంకేతం” పంపినట్లే.  


భారత్ తో స్నేహసంబంధాలు, పెట్టుబడులకు విదేశాలు పోటీపడే స్థితి ఏర్పడింది. ఇది నరెంద్ర మోడీ సాధించిన విజయమే. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో భారత్ ప్రతిష్ట పెరిగింది. బలమైన నాయకత్వం కారణం గా చైనా వంటి దేశాలు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. పాకిస్తాన్ కొంతవరకు తోక ముడిచిందనే చెప్పాలి. అన్ర్జాతీయంగా పాక్ ఒక ఉగ్రవాద దేశంగా గుర్తించేలా ముద్ర పడేలా చేయటంలో మోడీ సాధించిన విజయం అనితర సాధ్యం. ఈ విషయంలొ ఇందిరా గాంధి కూడా నమో ముందు బలాదూర్ అనిపించారు. 

national-&-international-news-narendra-modi-vs-ind

అంతర్గతంగా శాంతి సుస్థిరత నెలకొన్నప్పుడు విదేశాలు చొరబాట్లకు తెగించాలంటే జంకుతాయి. ఒకవేళ దుస్సాహం చేసినా తగిన మూల్యం చెల్లించుకుంటాయి. ఈవిషయాన్నిమోడీ నాయకత్వంలో నాలుగేళ్ల పాలన స్పష్టంగా చాటి చెప్పగలిగింది. దాదాపు ముప్పై సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో దేశం అంతర్గతంగా చాలా చితికిపోయింది. విదేశాలకూ లోకువై పోయింది. ఆ స్థితిలో కలగూరగంప ముద్ర నుంచి భారత్ ను బయటపడేసిన వ్యక్తిగా నరెంద్ర మోడీని చెప్పుకోవాలి. ఇతర పార్టీల తోనూ, మిత్రపక్షాలతోనూ వ్యవహరించే శైలి సార్వభౌముణ్ణి సామంతుల తరహాను తలపింపచేస్తుందనేది నరెంద్ర మోడీపై ఉన్న ప్రధాన విమర్శ. అదే అతని బలమూ, బలహీనత కూడా.

national-&-international-news-narendra-modi-vs-ind
కుల, కుటుంబ పాలన, ప్రాంతీయ విద్వేషాలు, జాతి సమగ్రతను పణంగా పెడుతున్న పార్టీలకు నరేంద్ర మోడీ పాలన ఒక హెచ్చరికగానే చెప్పుకోవాలి. తన కరిష్మా, ‘లార్జెర్ దేన్ లైఫ్ ఇమేజ్’ తో ప్రాంతీయ పార్టీలకు వణుకు పుట్టించగలిగారు. తమ అస్తిత్వం అడుగంటిపోతుంది. మనుగడ మృగ్యమైపోతుందన్న భయం ఆయా పార్టీల్లో ఏర్పడింది. 
national-&-international-news-narendra-modi-vs-ind
చిల్లర డిమాండ్లతో జాతీయ పార్టీలను బ్లాక్-మెయిల్ చేస్తూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో భాగస్వాములవుతున్న పార్టీలకు చెక్ పెట్టగలిగారు. అవినీతి మురికి లో కూరుకుపోయిన చిన్నా చితక పార్టీలు చెప్పినట్లు ఆడాల్సిన దుస్థితి నుంచి కేంద్రాన్ని బయటపడేశారు. ఈరోజున ప్రాంతీయ పార్టీల చేతులలో జాతి పగ్గాలు లేవు. నియంతృత్వ పోకడలు, కుటుంబ, కుల పాలన తో ప్రజాస్వామ్యాన్ని కొన్ని పార్టీలు చెరపట్టిన మాట వాస్తవం. తాము చెప్పిందే వేదం. చేసిందే శాసనం అన్నట్లుగా మారింది ఆయా పార్టీల అధినేతల వైఖరి. 
national-&-international-news-narendra-modi-vs-ind
దూసుకొచ్చిన మోడీ-వేవ్ వల్ల అటువంటి పార్టీల అరాచకత్వానికి అడ్డుకట్ట పడింది. మోడీ శైలి జాతీయ నియంతృత్వం అనే విమర్శలున్నాయి. దానిని అదుపులో ఉంచుకోగలిగితే బీజేపీకి, మోడీకి పొలిటికల్ హిస్టరీలో లాంగ్ ఇన్నింగ్సు కు ఇంకా అవకాశం ఉంటుంది. నరెంద్ర మోడీ ముఖ్యంగా చేయవలసిన అత్యంత కీలక మైన పని ఒకటి మిగిలిపోయింది ప్రతి వయో జనుడు తప్పనిసరిగా ఓటు వేయాలి-ఓటువెయటం తప్పదని-దానికి చట్టబద్దత తేవాలి.   అప్పుడు దేశంలో నిజమైన నాయకత్వం వర్దిల్లుతుంది. ఇది నోట్ల రద్దు, జిఎస్టి అమలు కంటే గొప్ప విషయమేమీ కాదు.   
national-&-international-news-narendra-modi-vs-ind
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏడిటోరియల్: ఇందరిలో కీలకంగా చక్రం తిప్పేదెవరు?  అయినా చక్రం తిప్పేదేముంది?
తెలంగాణాలో గల్లంతైన ఓట్లు 27 లక్షలు?
కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు
విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా బ్రేకింగ్ ! సుబ్రహ్మణ్యం స్వామి స్పందన షాకింగ్
తెలంగాణాలో కర్ణాటక తరహా కాంగ్రెస్ వ్యూహం? డికె శివకుమార్ రంగ ప్రవేశం? ఇక రేపు హార్స్ ట్రేడింగేనా?
సుప్రీంకోర్టులో తెలంగాణాకు ఎన్నికల రిజర్వేషణ్ల విషయంలో ఎదురుదెబ్బ
అప్పుడు ప్రజాకూటమికి కాంగ్రెస్ గుడ్-బై! విభేధాలు మొదలయ్యేనా?
ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ మాట నిజమైతే  ఉత్తమ్‌ - గడ్డం తీసే సమయం దగ్గరపడినట్లే?
ఓటర్ జాబితాలో పేర్లు లేకుండా చేసి ఓటింగ్ శాతం తగ్గిందని ఓటర్లను నిందిస్తే ఎలా?
తెలంగాణా అంతటా గులాబి గుభాళింపు లేనా? మరి ఆంధ్రా ఆక్టోపస్ సర్వే? తమాషా కాదు!
జాతీయ రాజకీయం సెమీ-ఫైనల్స్ - నాలుగు రాష్ట్రాల శానససభ ఎగ్జిట్-పోల్ ఫలితాలు
ఎన్నికల బరిలో గ్రేటెస్ట్ ఎవర్-గ్రీన్ హీరోయిన్
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
తెలంగాణా రారాజు కేసీఆర్ అంటుంది టైమ్స్ నౌ
ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నోడైన నిక్ ను ముగ్గులోకి దింపి మాయ చేసింది
ఆంధ్ర ఆక్టోపస్ - లగడపాటి రాజగోపాల్ - సర్వె - తెలంగాణా
ఓటర్ల జాబితాలో పేరు లేని గుత్తా జ్వాల అసహనం
తెలంగాణా ఎన్నికల ఫలితాలు తల క్రిందులైతే? ఇద్దరు చంద్రుల గతేమిటి?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ బలగాలు తెలంగాణా ఎన్నికలకు దూరం: ఈసి రజత్ కుమార్
చంద్రబాబు లక్ష్యం ఫలిస్తే శనేశ్వరం – టీఆరెస్ దీక్ష ఫలిస్తే కాళేశ్వరం: కెసీఆర్
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల స్కాం లో కాంగ్రెస్ పీకల్లోతున ఇరుక్కుందా?
హోరాహోరీ పోరు: కుత్బుల్లాపూర్
About the author