జపాన్ దేశ రాజధాని టోక్యోలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.58 గంటలకు వచ్చిన ఈ భూకంపం ధాటికి ప్రజలు భయపడి రోడ్లపైకి వచ్చేశారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 100 మందికి పైగా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా,100 మంది గాయాలపాలయ్యారు.  ఈ ఘటన జపాన్ లోని ఒసాకా పట్టణంలో సంభవించింది. మృతి చెందినవారిలో తొమ్మిదేళ్ల బాలిక మరియు ఇద్దరు యువకులు ఉన్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది.
Image result for జపాన్ లోని ఒసాకా
విద్యుత్ సరఫరా నిలిచిపోగా, రైళ్ల సర్వీసులు ఆగిపోయాయి. ఒసాకా ప్రాంతంలో 1920 తర్వాత వచ్చిన బలమైన భూకంపం ఇదే. చాలా ఇళ్లకు విద్యుత్ ను పునరుద్ధరించారు. రానున్న రెండు మూడు రోజుల్లో బలమైన తదుపరి ప్రకంపనలు రావచ్చని అక్కడి వాతావరణ విభాగం హెచ్చరించింది.  ఒసాకా లో సంభవించిన ఈ ప్రకంపనలు అతి పెద్దవని జపాన్ మెటరోలాజికల్ ఏజెన్సీ (జె.ఎం.ఏ) స్పష్టం చేసింది.
Image result for japan tokyo earthquake
భూకంప తీవ్రతకు ఒసాకా మరియు తాకట్ సూకీ లోని అనేక భవనాలు కూలిపోగా మరికొన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదాన్ని నివారించడానికి ఆయా పట్టణాలలోని రైల్వే సేవలను నిలిపివేశారు. 
japan-earthquick
జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిహిదే సుగా ప్రజలను మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దాదాపు 1, 70, 000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ ప్రకృతి బీభత్సము వలన. 1923 తరువాత ఈ స్థాయిలో ఒసాకా లో భూకంపం రావటం మొదటి సారి అని అధికారులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: