టిడిపికి మద్దతునిచ్చే మీడియా చేసే తప్పులకు టిడిపి తీవ్రంగా నష్టపోతోదని చంద్రబాబు నాయుడు గ్రహించటం అవసరం. వంది మాగద బృందంలో చేరిన ఆ మీడీయా చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గానికి పరోక్షంగా చేసే కీడు చెప్పనలవికాదు. ఉదాహరణకు ఈ మద్య ఏబిఎన్ - లగడపాటి రాజగోపాల్ తో చేయించిన సర్వే ఉత్తుత్తి దేనని గతంలో ఆర్జి చేసిన సర్వేనే  పలు విధాలుగా అటు ఇటు మార్చి తమ పచ్చ పత్రిక ద్వారా ప్రచారం చేస్తున్నారని ఇదంతా చంద్రబాబు మదిలో చెలరేగుతున్న మానసిక సంక్షోబాన్ని బహిర్గతం చేస్తుందని అనేకమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
YCP comments on AP Pulse suervey కోసం చిత్ర ఫలితం
ప్రజలు కూడా సర్వే చూసినవ్వుతున్నారంటే,  నిజానికి అందనంత అబద్ధాలతో నిండి వాస్తవానికి అది బహుదూరంగా ఉంది. తనే నేపధ్యంలో ఉండి చేయించిన ఈ పెయిడ్ సర్వే ని, భ్రమలో తానే మర్చి పోయి బాబు ఆ భ్రమలో కొట్టుకుపోతే, ఆయన రాజకీయంగా శంకరగిరిమాన్యాల్లోనే కాలం గడపవలసి వస్తుందని అంటున్నారు.  చంద్రబాబు నాయుడు మదిలో చెలరెగుతున్న సంక్షోబానికి ఈ సర్వే ప్రతిబింబమని చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు.  
YCP comments on AP Pulse suervey కోసం చిత్ర ఫలితం
"ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి చేసిన సర్వే, కల్పితమైంది, వారికివారు రూపొందించుకున్నట్టు తేలిపోయింది" మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు. "గతంలో తాను చేసిన సర్వేనే ఏబీఎన్‌ ఇలా వాడుకుంది" అని" లగడపాటి చెప్పి నట్టు పేర్కొన్నారు. మీడియా సమక్షంలోనే సర్వే ఫలితాలను స్వయంగా వెల్లడించడం లగడపాటి రాజగోపాల్‌ సాధారణంగా పాటించే సంప్రదాయమన్నారు.
vijay sai reddy photos కోసం చిత్ర ఫలితం
సర్వేబృందం సేకరించి ఇచ్చిన సమాచారాన్ని అసలు క్రోడీకరించలేదని, ఈ విషయంలో ఏబీఎన్‌ దొంగాట ఆడిందని తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు. లగడపాటి పేరుతో ఏబీఎన్‌ ప్రసారం చేసిన సర్వే ఒక బోగస్‌ అని, పూర్తిగా కల్పితమని యదార్ధంగా ఉన్న పరిస్థితులు వేరని అంటున్నారు ఇతర పాత్రికేయులు. ఈ సర్వే ఏబీఎన్‌ సృష్టించిందని, సర్వేకు చంద్రబాబు ఆర్థికంగా సహకరించారన్నారు. ఈ విషయంపై చంద్రబాబు, ఏబీఎన్, లగడపాటి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.
rk roja photos కోసం చిత్ర ఫలితం
తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్‌-సైట్ల ద్వారా ప్రచారం అవుతున్న వివరాలనే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆదివారం సంచికలో సర్వే పేరుతో ప్రచురించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తేల్చిచెప్పారు. సోమవారం ఆమె చిత్తూరుజిల్లా పుత్తూరులో విలేకరులతో మాట్లా డుతూ, నగరిలో వైసీపీ గెలుస్తుందని ప్రచురించిన ఆంధ్రజ్యోతి, సోమవారం మాత్రం నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పరిస్థితి బాగాలేదని ప్రచురించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 
సంబంధిత చిత్రం
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని తలంటడంతో నగరిలో ఒక్కరోజులో గెలుపు ఓటమిగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 19నియోజకవర్గాల్లో సర్వేచేసి టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, ఇది నీతిమాలిన సర్వే అని స్పష్టం చేశారు. ఆంధ్ర జ్యోతి కార్యాలయాలకు ప్రభుత్వభూములు, ప్రభుత్వసొమ్ముతో ప్రకటనలు దోచిపెడుతున్నారు కాబట్టే, ఆ పత్రికాయాజమాన్యం స్వామిభక్తి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు ఇలా ప్రజలకు పనికి రాని కంచిగరుడ సేవ చేస్తుందని అన్నారు. అయితే ప్రభుత్వం నుండి ప్రకటనలు ప్రయోజనాలు పుష్టిగా పోందే ఏబిఎన్ చానల్ ఆంధ్రజ్యోతి పత్రిక పుష్కళంగా సంపాదించుకుంటున్నాయని ప్రజలంతా సెటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: