పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో ఆర్థిక పరిస్థితి ఏమో కానీ సామాన్యుల పరిస్థితి మాత్రం కుడిలో పడ్డ ఎలుకలా తయారైంది.  బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటా..పరిధి మేరకే డ్రా చేసుకోవాలి..పోనీ ఇంట్లో దాచుకుందామంటే..దొంగల బెడద..పోనీ ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేద్దామా అటే నష్టాలొస్తాయని భయం..ఇలా పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యుల అవస్థలు ఇవి.  ఓ వైపు ప్రజలు ఏటీఎం సెంటర్లలో డబ్బులేదు మొర్రో అని వాపోతున్న వేళ, అసోంలోని గౌహతి సమీపంలోని టిన్సుకియా లైపులి అనే ప్రాంతంలో అరుదైన ఘటన జరిగింది. 

ఏటీఎం లోకి ఎలా వెళ్లిందో కానీ ఎలుక బయటకు రాలేక అది చేసిన పని చూస్తే గుండెలు బాదుకునే పరిస్థితి ఏర్పడింది.   గత నెల19వ తేదీన ఈ ఏటీఎంలో రూ. 29.48 లక్షల విలువైన రూ. 2 వేలు, రూ. 500 నోట్లను అధికారులు నింపారని, ఆపై ఏటీఎం పనిచేయక పోవడంతో కొన్ని రోజులు చూసి స్థానికులు ఈ విషయం చర్చించుకోగా స్థానిక పత్రిక ఓ కథనం ప్రచురించింది. 
Image result for rat atm
దీనిపై స్పందించిన అధికారులు ఈ నెల 11వ తేదీన అధికారులు ఏటీఎంను ఓపెన్ చేయగా, మిగిలిన కరెన్సీ చిత్తు కాగితాల్లా కనిపించాయని, ఓ ఎలుక ఈ పని చేసిందని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారని పేర్కొంది. జరిగిన ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాఫ్తు చేస్తున్నారని వెల్లడించింది.

తాజాగా సోషల్ మీడియాలో ఏటీఎంలో చిత్తు కాగితాల్లా పడివున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మరోవైపు ఇలాంటి ఫేక్ ఫోటోలు..ఫేక్ న్యూస్ లు జనాలను భయ బ్రాంతులను చేయడానికి కొంత మంది చేస్తున్న చీఫ్ ట్రిక్స్ అని కొట్టి పడేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: