ఈ మద్య కొంత మంది జర్నలిస్టులకు లైవ్ గా ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయి.  కొన్ని సందర్భాల్లో వారు ఊహించని పరిణామాలతో అవాక్కవుతున్న సంఘటనలు ఎన్నో జరిగాయి.  తాజాగా ప్రస్తుతం వరల్డ్ కప్ సాకర్ పోటీలు జరుగుతున్న రష్యాకు వెళ్లిన కొలంబియా మహిళా జర్నలిస్టుకు వింతైన అనుభవం ఎదురైంది ఓ జర్మన్ న్యూస్ చానల్ లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ అనే యువతి, సరన్స్ ప్రాంతంలో నిలబడి లైవ్ రిపోర్టు ఇస్తుండగా ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి ముద్దు పెట్టి వెంటనే వెళ్లిపోయాడు.

ఈ సంఘటనపై అప్పటికప్పుడు ఎలాంటి స్పందనా చూపని జూలియట్, తన లైవ్ కవరేజ్ ని కంటిన్యూ చేసింది.  ఆ తర్వాత ఈ విషయంపై స్పందించిన జూలియట్  తాను లైవ్ ఇస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ కాబోనని తెలుసుకున్న ఆ వ్యక్తి ఈ పని చేసి వెళ్లాడని..ఆ తర్వాత అతని గురించి నేను ఎంత వెతికినా కనిపించలేదని అన్నారు.

కాగా, అతను స్థానికుడా లేదా ఫుట్ బాల్ పోటీలు చూసేందుకు రష్యాకు వచ్చిన వేలాది మందిలో ఒకడా అన్నది తెలియరాలేదు.  కోట్ల మంది లైవ్ చూస్తున్న సమయంలో ఇలాంటి పని చేసిన ఆ ఆకతాయిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతే కాదు  ఓ మహిళా జర్నలిస్టుకు రక్షణ కల్పించడంలో రష్యా విఫలమైందని ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: