రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రిగినా మ‌న మంచికే అనుకోవ‌డం స‌హ‌జం. కానీ, ఏపీ అధికార పార్టీలో మాత్రం ఎప్పుడు ఏం జ‌రిగినా.. అది త‌మ ప‌త‌నానికే అని భావిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి ఎందుకంత జ‌డుపు ఆ పార్టీని, ప్ర‌భుత్వాన్ని ప‌ట్టి పీడిస్తోందో వారికే తెలియాలి. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ పై నిఘా పెంచిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వేసే ప్ర‌తి అడుగును స‌మీక్షించుకుంటున్నారు. ఆయ‌న వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం పొంచి ఉందోన‌ని తెగ ఫీల‌వుతున్నారు. అందుకే జ‌గ‌న్ వేసే ప్ర‌తి అడుగును, తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యాన్ని కూడా ప‌బ్లిక్‌లోకి తీసుకువ‌చ్చి క‌డిగేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా ను కాద‌న్న నోటితో కావాల‌న్న సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మే. అయితే, ఈ విష‌యం ఓట్ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డంతో దీనిలో సెల్ఫ్ గోల్ ప్రారంభించేశారు. 


ఇక‌, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం, బీజేపీతో చెలిమి విష‌యంలో తాను చేస్తే.. సంసార‌మ‌ని ప‌క్కాగా సాక్ష్యాధారా లతో స‌హా నిరూపించ‌డంలో బాబు స‌క్సెస్ అయ్యారు. అదేసమ‌యంలో బాబు స్వ‌యంగానే బీజేపీకి విడాకులు ఇచ్చారు. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర నుంచి పార్టీ జాతీయ సార‌థి అమిత్ షా వ‌ర‌కు చెప్పిందే. బాబు స్వ‌యంగా త‌నంత‌ట తానే ఎన్డీయే నుంచి వైదొలిగార‌ని, తిరిగి వ‌స్తే స్వాగ‌తిస్తామ‌ని చెప్పుకొచ్చారు. కానీ, చంద్ర‌బాబు.. మాత్రం ఈ విష‌యాన్ని కూడా త‌న‌కు పాజిటివ్‌గా మార్చుకున్నారు. 


జ‌గ‌న్‌.. బీజేపీతో చెలిమి చేస్తున్నాడ‌ని, ఇది రాష్ట్రానికి మంచిది కాద‌ని అంటున్నారు. దీనికి పార్టీ త‌మ్ముళ్లు బాకాలు ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లో విప‌రీత ప్ర‌చారం చేశారు. చంద్ర‌బాబు అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసుకుంటున్న జ‌గ‌న్‌పై నిఘా ఉంచారు. నిజానికి విప‌క్ష నేత చేసుకునే పాద‌యాత్ర‌పై చంద్ర‌బాబు ఇలా అధికారికంగా నిఘా పెట్ట‌డం అంటే.. జ‌గ‌న్ ఏ మ‌న్నా.. పాక్ నుంచి పారిపోయి వ‌చ్చాడా? ఇక్క‌డి వారిని రెచ్చ‌గొట్టి బాబుపై యుద్ధం చేయ‌మ‌ని చెబుతున్నాడా? అలాంటిది ఏమీ లేదే. ఓ రాజ‌కీయ పార్టీ నాయ‌కుడిగా ఆయ‌న త‌న‌కు ఓట్లేయ‌మ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఒక ఛాన్స్ ఇవ్వ‌మ‌ని అభ్య‌ర్థిస్తున్నారు. 


మ‌రి ఈ మాత్రం దానికి బాబు ఎందుకు ఇంత హ‌డావుడి చేస్తున్న‌ట్టు.. ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు బెస్ట్ అని భావిస్తే.. వారికే ప‌ట్టం క‌డ‌తారు. ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొంటున్న చంద్ర‌బాబు ఈ విష‌యంలోనూ చ‌తికిల ప‌డుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆగిపోయాయి. ఏ ఒక్క‌రూ రాష్ట్రం వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తీవ్ర అస‌హ‌నానికి గుర‌వ‌తున్న చంద్ర‌బాబు ఇలా లోప‌భూయిష్ట‌మైన నిఘాలు, స‌ర్వేల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: