తెలంగాణాలో ఎన్నికల సందోహం మొదలైంది. రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకే టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్రశేఖర రావు  మొగ్గుచూపుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఆయ‌న నుండి ఇలాంటి సంకేతాలు ప్రజ ప్రతినిధులకు మీడియాకు ఇందుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కీల‌క నేత‌ల‌తో జరిజే చ‌ర్చ‌లు సమందర్భంగా తెలుస్తోంది. 

telangana assembly elections in november కోసం చిత్ర ఫలితం

ముందుగా వెళ్తేనే, తమ పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న భావన‌లో ఆయ‌న ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆయన మాటలను బట్టి అవ‌స‌ర‌మైతే, న‌వంబ‌ర్‌ లో రానున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్‌, చ‌త్తీస్‌-ఘ‌డ్ శాసనసభ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని  "ఎన్నిక‌ల సంఘం" ను కోరే అవ‌ కాశాలు కూడా ఉన్న‌ట్లు ప‌లువురు చెబుతున్నారు.


దీనికి కారణం మేమిటంటే, వ‌చ్చేఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, ప‌లువామప‌క్షాలు అన్నీ క‌లిసి అధికార టీరెస్ తో పోటీ అవ‌కాశాలు ఉన్నాయని కేసీఆర్ భావన. అందుకే వారికి తగిన సమయం ఇవ్వకుండా తాను ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల భావన.


ఇంకా అనేక కార‌ణాలు ముఖ్యంగా: 

telangana congress leaders కోసం చిత్ర ఫలితం

*తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నా, ఆ పార్టీ నేత‌లు మాత్రం ఇంకా సరిగ్గా స్థిరపడలేదు. కాంగ్రేస్ కున్న సహజ గ్రూపు రాజకీయ వైరాలతో ఇంకా స‌త‌మ‌త‌ మ‌వుతూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ క్యాడ‌ర్‌ స‌మాయ‌త్తం కాలేదు. మ‌రోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌కుమార్‌ రెడ్డి పైనే ప‌లువురు నేత‌లు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. 

telangana jana samiti - kodandaram కోసం చిత్ర ఫలితం

*ఇక జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జ‌న‌స‌మితి కూడా ఇంకా క్షేత్ర‌స్థాయి కాడర్ నిర్మాణ ప‌నిలోనే ఉంది. చాలా వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోకి దూసు కుని వెళ్ల‌లేదు. గ్రామ, మండల స్థాయి క‌మిటీలు కూడా ఇంకా పూర్తికాలేదు. నిజానికి గ్రామ‌ స్థాయిలో తెలంగాణ జ‌న‌స‌మితిపై ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. 

సంబంధిత చిత్రం

*ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేస్తున్నా బీజేపీ కొంత‌మేర‌కైనా పట్టు చిక్కలేదు. అది కూడా అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఇదే స‌మ‌యంలో తెలంగాణా రాష్ట్రంలో తాము ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు మిష‌న్‌ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, క‌ళ్యాణ‌ లక్ష్మీ, రైతు బంధు, కేసీఆర్ కిట్లు, రైతు బీమాకు ప్ర‌జ‌ల్లో మంచి స్పంద‌న ఉంద‌న్న భావ‌న‌ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నారు. 


*కాంగ్రెస్‌, బీజేపీ, తెలంగాణ జ‌న‌ స‌మితులు పూర్తిగా బ‌ల‌ప‌డ‌క‌ ముందే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంవ‌ల్ల మ‌ళ్లీ అధికారంలోకి రావ‌చ్చ‌న్న అంచ‌నాల్లో ఉన్న కేసీఆర్   ఈ నేప‌థ్యం లోనే ఆయన ఎమ్మెల్యేల ప‌నితీరుపై తీవ్ర‌స్థాయిలో స‌ర్వేలు తదితర క‌స‌ర‌త్తులు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

modi kcr in niti aayog కోసం చిత్ర ఫలితం

అంతేగాకుండా, కీల‌క నేత‌లంద‌రికీ ముంద‌స్తు సంకేతాలు అందించి, అందుకు త‌గ్గ‌ట్లుగా ప‌క్కా వ్యూహం ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, "నీతి ఆయోగ్ స‌మావేశానికి ఒక‌రోజు ముందే ఢిల్లీకి వెళ్లి, ప్ర‌ధాని మోడీతో స‌మావేశం కావ‌డం" పై కూడా పలువురిలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నిక‌ల వేళ కేసీఆర్ కొంత‌మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ ను ఎంపీలుగా పోటీ చేయించే ఛాన్సులు ఉన్న‌ట్టు కూడా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.


ఎన్నిక‌ల వేడి నుంచి సెగలు గ్రక్కే స్థాయికి తీసుకెళ్ళటానికి  కేసీఆర్ ఇచ్చే ట్విస్టులు ఇస్తుండగా - మిగతా పార్టీలు ఇంకా తేరుకోకపోవటం టిఆరెస్ కు సానుకూలంగా ఉంటుందని వెలువడుతున్న అభిప్రాయాం. కెసిఆర్ ఎన్నికల విధానం మామూలుగా ఉండ‌దన్న‌దే తెలంగాణ పాలిటిక్స్‌ లో వినిపిస్తోన్న నేటి హాట్ టాపిక్‌.

mundastu ennikalu in telangana కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: