ఇందిరా గాంది - అడాల్ఫ్ హిట్లర్ లు ఒకే విధమైన పాలకులు అంటూ ఎమర్జెన్సీని గుర్తుచేసుకున్న అరుణ్ జైట్లీ, నిన్నటికి నాటి భారత ప్రధాని ఇందిరా గాంధి ఎమర్జెన్సీ విధించి  (25.06.1974) 43 యేళ్ళు పూర్తైన సందర్భంగా.  ప్రజాస్వామ్య భారత్ కు నియంతృత్వ రాక్షసపాలన అందించిన కాంగ్రెసును 21నేలల పాలన తరవాత యావద్భారతం తిరస్కరించింది. అనాటి ఘటనలను గుర్తుచేసుకున్నారు నాటితరం నాయకులు. అందులో అరుణ్ జైట్లి తన అనుభవాన్ని ప్రకటించారు. నాడు నితిష్, లాలు, అరుణ్ వీళ్ళు విద్యార్ధి నాయకులు. జాతికోసం అద్భుతంగా స్పందించారు.
adolf hitler vs indira కోసం చిత్ర ఫలితం 
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని జర్మనీ నియంత హిట్లర్ తో పోలుస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరపై, కాంగ్రెస్ పార్టీ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
adolf hitler vs indira కోసం చిత్ర ఫలితం
ఇందిర గాంది, అడాల్ఫ్ హిట్లర్  వీళ్లిద్దరూ రాజ్యాంగాన్ని రద్దుచేసిన వారేనని, ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చుకునేందుకు రాజ్యాంగాన్ని ఉపయోగించు కున్నా రని విమర్శించారు. నాడు ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయించిన హిట్లర్, తన మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 
adolf hitler vs indira కోసం చిత్ర ఫలితం
అయితే, హిట్లర్ లా కాకుండా భారత్ ను వంశపారంపర్య ప్రజాస్వామ్యంగా ఇందిర గాంధీ మర్చారని, ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపుల పాలు చేసిందని, ప్రాథమిక హక్కులను కాలరాసి ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియాపై ఆంక్షలు విధించారని, జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజపేయీ, ఎల్ కె అద్వాని, మొరార్జీ దేశాయ్‌, లాలు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, జార్జ్ ఫెర్నాండెజ్, జ్యొతి బసు లాంటి  ప్రతిపక్ష నేతల ను జైళ్లలో పెట్టారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆందోళన చేపట్టినందుకు తాను కూడా జైలుకు వెళ్లానని చెప్పారు.

sanjay gandhi and chandrababu కోసం చిత్ర ఫలితం

1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధికి అత్యంత సన్నిహిత మద్దతు దారుడుగా ఉన్నారు.  నాడున్న నేటితరం నాయకుల్లో ఎమర్జెన్సీని బలపరచినవాళ్లలో చంద్రబాబు ముఖ్యులు.  


ఈనాడు ఎప్పుడూ కాంగ్రెసును ఎమర్జెన్సీని సమర్ధించలేదు. జాతీయ ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా వ్యక్తీకరించేది. 

vajpayee, advani, jp in emergency కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: