త‌మ‌కు త‌గినంత ప్ర‌చారం ద‌క్కాల‌ని రాజ‌కీయ నాయ‌కులు కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. ఏం చేసినా చేయక‌పోయినా అనుకూల మీడియాలో ఎన‌లేనంత ప్ర‌చారం దొర‌కుతూనే ఉంటుంది. మ‌రి రాజ‌కీయాల్లో కొత్త‌గా వచ్చిన వారికి ఈ అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు! అందుకే సొంతంగా ప్ర‌చారం నిర్వ‌హించుకునేందుకు ఒక చాన‌ల్‌ను ప్రారంభిచ‌డ‌మో లేక సంస్థ‌నో అద్దెకు తీసుకుంటారు! ప్ర‌స్తుతం జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇదే ప‌ద్ధ‌తి ఫాలో అయిపోతు న్నారు. మొద‌ట్లో మీడియా ఆయ‌న‌పై చూపినంత ఫోక‌స్‌.. ఇప్పుడు లేద‌ని గ్ర‌హించిన పవ‌న్‌.. ఇక‌ ఎవ‌రిమీదా ఆధార‌ప డకూడ‌దని భావించిన‌ట్లున్నాడు! అందుకే త‌నకంటూ సొంతంగా చాన‌ల్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఇప్ప‌టికి ప్పుడు సంస్థ ప్రారంభించ‌డ‌మ క‌ష్ట‌మ‌ని తెలుసుకుని.. మిత్రులైన క‌మ్యూనిస్టుల చాన‌ల్‌ను అద్దెకు తీసుకున్నాడ‌ట‌. సంస్థ అప్పుల్లో ఉంటే దానికి ఆర్థిక సాయం చేసి మ‌రీ.. నిలబెట్టాడ‌ట‌.!

Image result for jenasena

క‌మ్యూనిస్టుల‌నే కాదు.. వాళ్ల చాన‌ల్‌ను కూడా ప‌వ‌న్ ఫుల్లుగా వాడేసుకుందామ‌ని డిసైడ్ అయిపోయాడ‌ట‌. పవ‌న్ తొలి నుంచి కమ్యూనిస్టుల‌తోనే ఎక్కువ సావాసం చేస్తున్నాడు. సీపీఐ, సీపీఎం పార్టీల నాయ‌కులు కూడా ప‌వ‌న్ వెంటే న‌డుస్తున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్ల‌తో కల‌సి ప‌వ‌న్‌ పోటీచేస్తార‌ని అంతా భావిస్తున్నారు. ఈ స‌మ‌యంలో త‌మ‌కు ప్ర‌చారం కల్పిచేందుకు మీడియా సంస్థ‌లు వెన‌క‌డుగు వేస్తున్నాయ‌ని ప‌వ‌న్ గ్ర‌హించాడ‌ట‌. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబుతో విభేదించిన త‌ర్వాత మీడియాలో జ‌న‌సేన‌కు ఇస్తున్న ప్ర‌యారిటీకి, అంత‌కు ముందు ఇచ్చిన‌ ప్ర‌యారిటీని బేరీజు వేసుకుంటే అనూహ్య మార్పులే వ‌చ్చిన విష‌యం తెలిసిందే! చంద్రబాబుకు మద్దతు ప‌లుకుతున్నంతసేపూ కొన్ని టీవీ చానళ్లు పవన్ కల్యాణ్ వార్తలను తెగ ప్రసారం చేశాయి. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దూరం అయ్యాడో అక్కడ నుంచి ఆ చానళ్ల తీరు మారిపోయింది. 

Image result for jenasena

ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను పట్టించుకోవడం మానేశాయి. త‌న‌కు వ్యతిరేకంగా ఆ చానళ్లు చాలా మంత్రాంగం నడిపించాయని స్వయంగా పవన్ కల్యాణే చెప్పాడు. తనకు వ్యతిరేకంగా మీడియా అధిపతులు కుట్ర చేశారని, లోకేష్ ఆధ్వర్యంలో ఆ కుట్ర జరిగిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. ఆ మేరకు ట్వీట్లు చేశాడు. దీంతో మీడియాకు, పవన్ కల్యాణ్ కు మధ్యన వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక మీడియా సహకారం తీసుకోవాలని భావిస్తున్నాడట. సొంతంగా చానల్ పెట్టుకోవడం దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం పవన్ కు ఇప్పుడుంత ఈజీ కాదు. అందుకే రన్నింగ్ లో ఉన్న ఒక చానల్ ను హైర్ చేస్తున్నాడట పీకే. అదే 10 టీవీ. 


ఇది కమ్యూనిస్టుల చానల్. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కు కమ్యూనిస్టులకు మధ్య సత్సంబంధాలున్నాయి. ఈ చానల్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తనకు తెలిసిన ఒక వ్యాపారవేత్త చేత ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ టీవీ చానల్లో పెట్టిస్తున్నాడని.. తద్వారా దాన్ని తన అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా డని సమాచారం. తనకంటూ ఒక మీడియా సంస్థ సహకారం అవసరం అని పవన్ ఈ పని చేస్తున్నాడట. ఏకంగా ముప్పై కోట్లు ఆ చానల్లో పెట్టించి.. అనుకూల మీడియా వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాడట పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: