ఇంద్రకీలాద్రి నేరాల నిలయంగా అనేక వివాదాలకు అక్రమాలకు అవినీతికి ఆలవాలమై వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం "మహిళా భక్తుల డార్మిటరీ" లలో  "సీసీటీవీ కెమెరాలు" ఏర్పాటు చేయటం వివాదాలకు దారితీసింది. తెలుగుజాతి ఇలవేలుపు విజయవాడలో నెలకొని ఉన్న కనకదుర్గ గుడి తరఫున వన్‌టౌన్‌ లోని సీవీరెడ్డి చారిటీ ఈ డార్మిటరీ లను నిర్మించింది. 
సంబంధిత చిత్రం
ఏయిర్ కండీషణ్డ్ విభాగంలో ఉన్న "మహిళల సామూహిక వసతి" (డార్మిటరీ) లో సీసీ కెమెరాలు బిగించి ఉండటంపై నిన్న సోమవారం కొందరు మహిళలు అభ్యంతరం తెలిపారు. మహిళలు దుస్తులు మార్చు కోవడానికి ఇబ్బందిగా ఉందని ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విశ్రాంతి గృహాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని మహిళలు ఆరోపించారు. సీసీ కెమెరాలు ఉంటే మహిళలు దుస్తులు ఎలా మార్చు కుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
సంబంధిత చిత్రం
ఇప్పటివరకు నమోదైన సిసి కెమెరాల ఫుటేజీని వెంటనే తొలగించి ప్రైవసీ కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు. మహిళల వసతిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదని, వాటికి కనెక్షన్ ఇవ్వలేదని ఆలయ అధికారులు చెప్తున్నారు.
kanaka durga temple Executive Officer Padma కోసం చిత్ర ఫలితం
డార్మిటరీలు విశ్రాంతి తీసుకోవడడానికే కానీ బట్టలు మార్చుకునేందుకు కాదని ఆలయ ఈవో పద్మ పేర్కొన్నారు. ఈ కార్యనిర్వాహణాధికారికి కామ సెన్స్ ఉందా?  అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే వసతి గృహాల్లో దుస్తులు మార్చుకోరా అనీందరూ ప్రశ్నిస్తున్నారు. బాధ్యత తెలియని వ్యక్తులు అధికారులైతే పరిస్థితులు ఇలాగే తగలడ  తాయని జనం చెప్పుకుంటున్నారు. 
kanaka durga temple Executive Officer Padma కోసం చిత్ర ఫలితం
మహిళా డార్మిటరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తప్పేనని దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు అంగీకరించారు. సీసీ కెమెరాలను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: