గత కొంత కాలంగా ప్రపంచంలో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు.  ఎక్కడ నుంచి ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.  ఈ క్రమంలో ఉగ్రమూకలు పెద్ద నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారని ఇంటెలీజెన్స్ వర్గాలు తెలుపుతున్నారు.  2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని పాల్గొనే రోడ్ షోలే టార్గెట్‌గా కొన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది.  రాష్ట్రాలనూ చుట్టేస్తూ ప్రజలతో మమేకమై, రోడ్ షోలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీకి, గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదం పొంచివుందని, ఆయన ప్రాణాలు తీసేందుకు విద్రోహశక్తులు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
All time high threat to Modi,warns Home Ministry
ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్ర హోమ్ శాఖ నుంచి మోదీ పర్యటనల వేళ, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కొత్త నిబంధనలు వెళ్లాయి.  మోదీ దగ్గరకు ఎవరూ వెళ్లకుండా చూసుకోవాలని, దీన్ని ప్రథమ నిబంధనగా ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్రాల బీజేపీ చీఫ్ లకు కూడా తెలిపింది. ఆయన భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అనుమతితోనే అధికారులు, నేతలు ఆయన వద్దకు వెళ్లాలని తెలిపింది.

తాజాగా నక్సల్స్ నుంచి బెదిరింపు వచ్చిన తర్వాత ప్రధానికి మరింత భద్రతను పెంచాలని భావిస్తున్నట్లు సెక్యూర్టీ ఏజెన్సీ పేర్కొన్నది. మోడీని రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోలు కుట్ర పన్నారని వివరించింది. అయితే మావోల కుట్రను భగ్నం చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. ప్రధానికి సమీపంగా ఎవరూ వెళ్లకూడదన్న ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ స్క్రీనింగ్ తర్వాతనే ఎవరైనా ఆయన వద్దకు వెళ్లాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: