చూడగానే ఇదేదో ప్రజలకు డబ్బు ఎరవేసి ఓట్లు వేయించుకోవటానికి నిర్దేసించినట్లు కనిపించే తెలంగాణా ప్రభుత్వ "రైతుబంధుపథకం" వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి పోతోందని, అర్హులకే ఆర్థికసాయం అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది పి.యాదగిరిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. 
raitubandu telangana కోసం చిత్ర ఫలితం
ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని నిన్న మంగళవారం ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది. 
raitubandu telangana కోసం చిత్ర ఫలితం
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరికి వ్యవసాయభూమి ఎకరా ఒక్కింటికి ₹ 4వేల సహాయాన్ని రైతులందరికీ ఇవ్వడంవల్ల ప్రజాధనం వృథా అవుతోందని, తద్వారా అనేకమంది అత్యున్నత ఆదాయ వర్గాలకు సహాయం అవసరం లేని వారికి మేలు జరుగుతుందని - అందువల్ల చిన్న, సన్న కారు రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందించేలా చూడాలంటూ యాదగిరి రెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది.
raitubandu telangana కోసం చిత్ర ఫలితం
ఉన్నతస్థాయి వర్గాలకు, సెలబ్రిటీలకు కూడా ఈ ప్రయోజనం ఒనగూడగా వారిలో కొందరు చెక్కులను ప్రభుత్వానికి త్రిప్పి పంపినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.  

సంబంధిత చిత్రం

రైతుబంధు చెక్కులను వెనక్కిచ్చిన హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ 

మరింత సమాచారం తెలుసుకోండి: