ఈ మద్య తెలుగు దేశంలో కొంత మంది సీనియర్ నేతలు తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అలక బూనుతున్న విషయం తెలిసిందే.  కొంత మంది ఇతర పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  అలాంటి వారిలో గల్లా అరుణకుమారి ఒకరు.  ఆ మద్య పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  దీంతో అలర్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సీనియర్ నేత, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి గల్లా అరుణకుమారికి పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశం లభించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. తన తల్లి గల్లా అరుణను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యురాలిగా నియమించడంపై ఆమె కుమారుడు, ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.
Image result for chandrababu
ప్రత్యక్ష ఎన్నికలకు 30 సంవత్సరాలు దూరంగా ఉన్నంతమాత్రాన రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్టు కాదని జయదేవ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా గల్లా అరుణ తనయుడు ఎంపీ గల్ల జయదేవ్ తల్లికి శుభాకాంక్షలు చెబుతూ, మీ అనుభవం, జ్ఞానం, కరుణ, విశ్వసనీయత పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి మేలు చేస్తాయన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: