ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్నారు. తాజా నియామకంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు రెగ్యులర్‌ చీఫ్‌ జస్టిస్‌ నియామకం జరిగినట్లయింది.    ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ వ్యవహరిస్తున్నారు. 
Image result for జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠీకి పదోన్నతి కల్పించి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం ఈ ఏడాది మొదట్లో చేసిన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ న్యాయవాదులే.
Image result for జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్‌.. కొల్లమ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.  కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లా కాలేజీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. 1983 డిసెంబరులో న్యాయవాది గా నమోదు చేయించుకుని తిరువనంతపురంలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తర్వాత ఎర్నాకుళంలోని హైకోర్టుకు మారారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: