ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేంద్రీయ సాగుకోసం  తీసుకున్న చర్యలపై పర్యావరణవేత్తలు సాహో‌ అంటున్నారు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రత్యేక కథనం వచ్చింది.  రసాయన రహిత వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని తన కథనంలో ప్రశంసించింది. ఇండియాలోనే మొట్టమొదటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ రాష్ట్రం అంటూ కితాబునిచ్చింది.
Image result for agriculture
వ్యవసాయం అనగానే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడిగా రసాయనాల వాడకం. ఇప్పుడు మోడ్రన్‌ కాలంలో సేద్యానికి అర్థం మారిపోయింది. ఈ తరహా సాగుతో దిగుబడి సంగతి ఏమో కానీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విచ్చలవిడి రసాయనాల వాడకంతో రైతుల ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్‌ చూపిస్తోంది. 

చంద్రబాబు వేసిన ముందడుగు ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సేంద్రీయ సాగుకోసం చంద్రబాబు తీసుకున్న చర్యలపై పర్యావరణవేత్తలు సాహో‌ అంటున్నారు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రత్యేక కథనం వచ్చింది.

పొరుగున ఉన్న కర్ణాటక ఏపీ బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ను కర్ణాటకలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. పర్యావరణహితంగా సాగే ఈ తరహా సాగుపై మిగతా రాష్ట్రాల దృష్టి పడింది. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తే ఇపుడు మిగతా రాష్ట్రాలు అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: