మన నాయకులు దేశానికి చేసే సేవ చిటికెడు ప్రచారం చాటెడు. రోడ్లు ఊడుస్తారు, మొక్కలు నాటుతారు, పసివాళ్ళకు ఆహారం తినిపిస్తారు ఒక 'క్లిక్'  కాగానే ఆపేస్తారు. అంటే మీడియాలో ప్రచారానికి మాత్రమే వీళ్ళు పని చేస్తారు.


నిజానికి నాట్లు ఎక్కడ వేస్తారు. వరి పొలంలో. కానీ, రెండ్రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం రావికంటి పేట గ్రామం లోని "గ్రీన్‌ఫీల్డ్‌ మైదానం" లో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని కాళ్ళకు చెప్పులతోనే నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ముఖ్యమంత్రి నాతా చంద్రబాబు నాయుడు వేసిన నాట్లు మాత్రం పొలం కాని పొలంలోని శాక్షి మీడియా చెపుతుంది.


ఏరువాక ప్రారంభానికి సూచికగా అక్కడ నిజంగా నాట్లు వేస్తున్నట్లు ఆయన పోజులిచ్చేశారు. కెమేరాలు క్లిక్‌-క్లిక్‌ అన్నాయి. సీన్‌-కట్‌ చేస్తే, అది వరి పొలం కాదని "సాక్షి మీడియా"  పరిశీలనలో తేలిందట. మైదానంలో కంకర, మట్టి తోలి అక్కడ కృత్రిమంగా మడిని ఏర్పాటు చేశారట.  అంతేకాదు, ఆయన నాటిన వరినారు 48గంటల్లో ఎండిపోయి వాడిపోయిందట. స్థానిక ప్రజలు ఈ చంద్రబాబు షో చూసి "హవ్వా" అని ముక్కున వేలేసుకుంటున్నారట. ఆడాళ్ళు బుగ్గలు నొక్కుకున్నారట.


వింటే నమ్మశక్యంగా లేదు కదూ! దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ప్రపంచంలో పబ్లీసిటి కోసం పాకులాడే వారు ఎవరైనా ఉన్నారా? అంటే మొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరువాతే అని అందరూ చెబుతారు. నీరు లేకుండానే వరి పండించ గల సమర్థుడు బాబు, ఎండు పొలంలో వరినాటే టెక్నాలజీ, బీకాంలో ఫిజిక్స్‌ చెప్పించే సమర్థత, మన టీడీపీ నాయకులకే సాధ్యం అంటూ నెటిజన్లు వీటిపై కామెంట్లు గుప్పిస్తున్నారు.


చంద్రబాబు వేసిన వరినాట్లు 48గంటల్లోనే ఎండిపోయిన దృశ్యం  (ఇన్‌సెట్‌ లో) గ్రీన్‌ఫీల్డ్స్‌ మైదానం లో పొలాన్ని తలపించేలా కృతిమంగా ఏర్పాటు చేసిన మడి. అసలు చంద్రబాబు గారికి ఈ ప్రచారం దురదేంటో అర్ధంకాదు. అంత నాట్లెయ్యాలంటే యదార్ధంగానే వరిపొలంలో చేస్తే గౌరవం మిగిలేది. దొరక్కదొరక్క సాక్షికి దొరికితే ఇంకే ముంది పరువు బట్టబయలే. అదే ఏబిఎన్లో అద్భుతంగా రాసేస్తారు. అయితే సాక్షి ముందే రాయటం అప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ కావటంతో బాబు బాగోతం బట్టబయలు కావటం తో ఆయన్ని నాటకాల రాయుడు అంటున్నారు జనం.

Image result for chandrababu eruvaka in Srikakulam

మరింత సమాచారం తెలుసుకోండి: