Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 3:12 pm IST

Menu &Sections

Search

భారత నేరగాళ్ళే కాదు, ప్రపంచ నేరగాళ్ల స్వర్గధామం బ్రిటన్?

భారత నేరగాళ్ళే కాదు, ప్రపంచ నేరగాళ్ల స్వర్గధామం బ్రిటన్?
భారత నేరగాళ్ళే కాదు, ప్రపంచ నేరగాళ్ల స్వర్గధామం బ్రిటన్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
షాకింగ్ వార్తేమంటే షికాగో సెక్స్ రాకెట్ నేర విచారణ జరుగుతుండగానే తానా సభ్యుడొకరు లండన్ కు చెక్కేశారట, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాలలాగే.
ఐపీఎల్‌ క్రికెట్‌ మాజీ సారథి లలిత్‌ మోదీ, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వేలకోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు వీరందరి గమ్యం మాత్రం బ్రిటన్‌ దేశమే.  వీరే కాకుండా వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, అసమ్మతి నాయకులు, ప్రవాసంలో ఉన్న వారికి, సొంత దేశాల్లో ప్రాణ భయాన్ని ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్‌ భద్రంగా తలదాచుకునే గమ్యస్థానంగా నిలుస్తోంది.
international-&-national-news-briton-criminals-par
పరిశీలిస్తే ఒక్క 2013 సంవత్సరంలోనే  5,500 మంది పైగా భారతీయులు బ్రిటన్‌ లో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. బ్రిటన్ అంగీకరిస్తే, వారికి శరణార్థి హోదా లభించడమే కాకుండా అక్కడ ఐదేళ్ల పాటు ఉండేందుకు అనుమతి లభిస్తుంది.  పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణ చట్టాల కారణంగానే అనేక మంది ఇంగ్లండ్‌ లో ఆశ్రయం పొందేందుకు తహతహలాడుతున్నారు. మానవ హక్కుల పరిరక్షణలో ప్రపంచంలోనే కట్టుదిట్టమైనదిగా 'బ్రిటన్‌ మానవ హక్కుల సంఘం' పేరు గడించింది. మానవ హక్కులకు సంబంధించి ఐరోపా దేశాల ఒప్పందంలో బ్రిటన్‌ భాగస్వామిగా ఉంది. 


వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బ్రిటన్‌ నుంచి సొంతదేశానికి తిప్పి పంపిస్తే వారికి మరణశిక్ష పడడమో లేదా వారికి చిత్రహింసలు తప్పవనో భావిస్తే అక్కడి కోర్టులు స్వదేశాలకు పంపేందుకు అంగీకరించవు. రాజకీయకారణాల వల్ల ఎవరినైనా వెనక్కి పంపించాలని ఆయా దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. బ్రిటన్‌ లో మానవ హక్కులకు ప్రాధాన్యమెక్కువ 


తీవ్రవాద కార్యకలాపాల్లో పాత్ర కారణంగా 2004లో టైగర్‌ హనీఫ్‌ను, అదే ఏడాది కుట్ర, చౌర్యం కేసుల్లో షేక్‌ సాదిక్‌ ను, ఫోర్జరీ కేసులో 2009లో రాజ్‌కుమార్‌ పటేల్‌ను, ఫోర్జరీ, మోసానికి సంబంధించిన కేసుల్లో 2011లో రాజేశ్‌ కుమార్‌ను, లైంగికపరమైన నేరాల విషయంలో 2012లో అతుల్‌సింగ్‌ను, బ్యాంకింగ్‌ రంగ మోసాలపై 2014లో జతీందర్‌ కుమార్, ఆశారాణి అంగురాల దంపతులను భారత్‌కు తిప్పి పంపాలని మన కేంద్ర ప్రభుత్వం బ్రిటన్‌ను కోరింది. 
international-&-national-news-briton-criminals-par
అయితే ఈ విజ్ఞప్తులన్నీ కూడా అక్కడి న్యాయస్థానాల్లో ఇంకా పెండింగ్‌ లోనే ఉండటం గమనార్హం. మోసాలు, అక్రమాలతో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించిన లలిత్‌  మోదీ,  విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను తిప్పి పంపించాలన్న విజ్ఞప్తులపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది.  వివిధ కేసుల్లోని నిందితులు, దోషులను పరస్పరం అప్పగించుకునేలా 1992లో బ్రిటన్‌-భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కేవలం సమీర్‌భాయ్‌ వినూభాయ్‌ పటేల్‌ ను మాత్రమే బ్రిటన్‌ భారత్‌కు తిప్పి పంపింది. గుజరాత్‌ గోధ్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లలో ప్రమేయముందన్న ఆరోపణలున్న సమీర్‌భాయ్‌ ను 2016లో అప్పగించింది.


భారత అధికారులు జారీ చేసిన ‘రెడ్‌కార్నర్‌ నోటీసు’ లపై స్పందించి, లండన్‌ లో స్కాట్‌లాండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక వివిధ కేసుల్లో బ్రిటన్‌ నుంచి పారిపోయి భారత్‌ లో తలదాచుకుంటున్న నలుగురిని భారత్‌ తిప్పి పంపించింది. పలు కేసుల్లో నిందితులైన 57మందిని భారత్‌ కు అప్పగించాలంటూ చేసిన విజ్ఞప్తులను బ్రిటన్‌ తోసిపుచ్చింది.
international-&-national-news-briton-criminals-par

అప్పగింత ప్రక్రియ,ఇబ్బందులివీ.. 

వివిధ కేసుల్లో నిందితులైన వారిని భారత్‌ కు తిప్పి పంపించే విషయంలో బ్రిటన్‌ న్యాయవ్యవస్థ లోని పలు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అక్కడి సంక్లిష్టమైన న్యాయ ప్రక్రియ వల్లనే నిందితులను భారత్‌కు రప్పించడంలో జాప్యం జరుగుతోంది.
international-&-national-news-briton-criminals-par

ఆ అంశాలేమంటే:

- ఫలానా కేసులో ఫలానా వ్యక్తిని తిప్పిపంపాలంటూ భారత్‌ పంపించిన విజ్ఞప్తిని ఆమోదించాలా లేదా అన్నది బ్రిటన్‌ విదేశాంగశాఖ మంత్రి నిర్ణయించాలి. 
- ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ వ్యక్తి అరెస్ట్‌ కు వారంట్‌ జారీ చేయాలా వద్దా అన్న దానిపై అక్కడి కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి అక్కడి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. 

- ముందుగా ప్రాథమిక విచారణ జరుగుతుంది. అనంతరం స్వదేశానికి తిప్పిపంపే అంశంపై విచారణ ఉంటుంది. నిందితుడిని వెనక్కు పంపేందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే,  దానిపై ఆదేశాలు ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై  విదేశాంగ మంత్రి నిర్ణయించాలి. 

- ఒక వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్‌ పంపించిన వారంట్‌ లో పేర్కొన్న అంశాలు, చేసిన నేరం స్వదేశానికి పంపించేంత తీవ్రమైనదా?  కాదా?  అన్న దానిపై కేసు విచారణ సందర్భంగా జడ్జి సంతృప్తి చెందాలి.  

- నిందితుడిని వెనక్కి పంపించడం సరైనదా?  కాదా?  అన్న అంశంపై జడ్జి నిర్ణయం తీసుకోవాలి.  

- తిప్పి పంపించడం వల్ల నిందితుడి మానవ హక్కులకు  భంగం వాటిల్లుతుందా? లేదా? అన్నది జడ్జి పరిశీలిస్తారు 

ఉదాహరణకు ఏదైనా కేసులో ఓ వ్యక్తిని భారత్‌ కు పంపించేందుకు విదేశాంగ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి హైకోర్టు లో సవాల్‌ చేయవచ్చు. దానిపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చు. స్వదేశానికి పంపించే వ్యక్తి మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉందంటే మాత్రం వెనక్కి పంపించేందుకు అంగీకరించరు.

international-&-national-news-briton-criminals-par

international-&-national-news-briton-criminals-par
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎరిక్సన్ కేసులో అనిల్ అంబాని కోర్ట్ ధిక్కరణ-నేరం ఋజువైంది: సుప్రీం కోర్ట్
విశ్వవిజేతలు: రతన్ టాటా-అవమానించిన వారిపై కోపాన్ని, తన లక్ష్యంగా మార్చుకొని మౌనంగా విజయం సాధిస్తారు!
 ఇండియా టుడే సర్వే - దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు!
మేం చేస్తే..సంసారం..ఇంకోళ్లు చేస్తే ఏదో అన్నట్టుంది టీడీపీ వ్యవహారం!
తాను త్రవ్వుకున్న గోతిలో చంద్రబాబు  తానే పడబోతున్నారా!
భారత్ కు ప్రథమ ప్రధాని నెహౄ ఇచ్చిన బహుమతి ఆర్టికల్ 370 - దేశం మెడలో కట్టిన గుదిబండ
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
About the author