ఈ మద్య  ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన మద్యలో పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మద్య టీడీపీ కి చెందిన కొంతమంది నాయకులు వైసీపీ, జనసేన లోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే.   గత రెండేళ్ల క్రితం వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు.  ఈ మద్య రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.  తాజాగా తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ నేతలు బీ జగదీశ్వర్‌రెడ్డి, ఆయన సోదరుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బీ జయచంద్రారెడ్డిపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. 


ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు టీడీపీ నేతలను పార్టీ అధిస్థానం ఈ రోజు సస్పెండ్ చేసింది. ఈ మేరకు పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధికారికంగా మీడియాకి తెలియజేశారు. వీరు బినామీ పేర్లతో అక్రమంగా గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని బీకే తెలిపారు.ఈ అంశాలపై షోకాజ్‌ నోటీసు జారీచేయగా వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతోపాటు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు స్పష్టం కావడంతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు.

Image result for chandrababu naidu

ఇది ఇలా ఉండగా, వాళ్లిద్దరూ ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని తాము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జేసీ కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు ఓ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: