దేశ రాజకీయాల్లో ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలియని వారు ఉండరు.  ఆయన రాజకీయాల్లో కన్నా కాంట్రవర్సీలతో నే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.  ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న లాలూ ఇంటి నుంచి మరొకరు రాజకీయాకల్లోకి రాబోతున్నారు.  కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లూలా ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యరాయ్ రాజకీయ రంగప్రవేశం చేయనుందా అంటే అవునంటున్నారు ఆ పార్టీ నేతలు. 
Tej Pratap Yadav & wife Aishwarya Rai
ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐశ్వర్యారాయ్ తోపాటు లాలూ, రబ్రీదేవిల ఫోటోలతో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తేజ్ ప్రతాప్ మే 29వతేదీన ఐశ్వర్యారాయ్ ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. విద్యాధికురాలైన ఐశ్వర్యారాయ్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది.  రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన లాలూ కోడలు రాజకీయాల్లో రాణిస్తుందని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తియాదవ్ చెప్పారు.
Image result for lalu prasad yadav
2019 లోక్‌ సభ ఎన్నికల్లో బీహార్‌లోని శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. శరణ్ నియోజకవర్గం నుంచి రెండు దశాబ్దాల పాటు ఐశ్వర్యారాయ్ తండ్రి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికే లాలూతోపాటు అతని భార్య రబ్రీదేవి, ఆమె ఇద్దరు సోదరులు సాధు, సుభాష్ యాదవ్ లు, లాలూ పెద్ద కుమార్తె మీసాభారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వీలు ఇప్పటికే రాజకీయాల్లో చేరి కొనసాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: