Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 12:40 am IST

Menu &Sections

Search

ఎంపి బాల్క సుమన్ టిఆరెస్ కు అంటించిన సెక్స్ బురద బాగోతం

ఎంపి బాల్క సుమన్ టిఆరెస్ కు అంటించిన సెక్స్ బురద బాగోతం
ఎంపి బాల్క సుమన్ టిఆరెస్ కు అంటించిన సెక్స్ బురద బాగోతం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక వ్యక్తి ఓవర్నైట్ అందలానికెక్కితే లోపలి కోరికలు కాలనాగుల్లా బుసకొడతాయి. గుర్రాలై పరుగెత్తుతాయి. ఇంకేం చేతిలో అధికారం. చుట్టూ అవకాశాలు. అందిపుచ్చు కుంటే పోలా! అంటుంది సయ్యటలాడే మనసు. అదేజరిగి ఉండవచ్చని అంటున్నారు పెద్దపల్లి వాసులు బాల్క సుమన్ ను గుఱించి. ఆయనలో గతానికి ఈ నాలుగేళ్ళలో అనేక అనూహ్య మార్పులు వచ్చాయని ఎరిగిన వారు అంటున్నారు.  అందుకే నడమంత్రపు సిరి నరాల మీద పుండంటారు అదికారమూ నడమంత్రంగా వస్తే అంతే 
 

పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్‌ సెక్స్ వివాదంలో ఇరుక్కున్నారు. బంజారాహిల్స్‌ లోని ఆయన ఫ్లాట్‌ లోకి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వచ్చి దౌర్జన్యం చేశారని, తనను బెదిరించారని ఈ పార్లమెంట్ సభ్యుని సహాయకుడు మర్రి సునీల్‌ జూన్ నెల 7వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ పిర్యాదు సారాంశం ఏమంటే:

telangana-news-peddapalli-mp-balka-suman-sexual-ha

"మే 31న సాయంత్రం బంజారాహిల్స్‌ నందినగర్‌ లో ఉన్న ఈ ఎంపీ గారి అపార్ట్‌మెంట్‌ కు వచ్చిన ఆ నలుగురు దుండగులు తనను నెట్టేసి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారని, బాల్క సుమన్‌ కోసం ఇల్లంతా వెతికారని తెలిపారు. లోపల ఆయన లేకపోవడంతో ఆయన్ను, తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని చెప్పారు. అంతే కాకుండా వారు దౌర్జన్యం చేసి వెళుతూ, వెళుతూ ఎంపీ బాల్క సుమన్ ,మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించినట్లు వెల్లడించారు. దౌర్జన్యం చేసిన వారి పేర్లను సంధ్య, విజేత, శంకర్‌, గోపాల్‌ గా చెప్పారు. సునీల్‌ ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై పోలీసులు ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇదే అంశంలో ఎంపీ బాల్క సుమన్‌ పై పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్‌, న్యాయవాదులు వీఎస్‌రావు, ఎంఎస్‌ రెడ్డి భారత ప్రధానికి నరెంద్ర మోడీకి ఫిర్యాదు లేఖ ద్వారా చేశారు. అందులో సంధ్య, విజేతలు నిందితులు కాదని, వారు బాధితులని లేఖ పూర్వకంగా తెలిపారు. సంధ్య, విజేతలు మాత్రమే కాకుండా మరి కొందరు మహిళలు చాలా కాలంగా ఈ పార్లమెంట్ సభ్యుని చేతిలో కిరాతక లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు.


telangana-news-peddapalli-mp-balka-suman-sexual-ha


telangana-news-peddapalli-mp-balka-suman-sexual-ha

సంధ్య, విజేత, శంకర్‌, గోపాల్‌ లు ఎంపీ బాల్కసుమన్‌ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, దౌర్జన్యం చేశారని ఎంపీ సహాయకుడు మర్రి సునీల్‌ ఫిర్యాదుపత్రంలో పేర్కొన గా పోలీసులు మాత్రం ఎక్కడా ఎంపీ బాల్క సుమన్ పేరు ప్రస్తావన రాకుండా జాగ్రత్తగా "ఎఫ్‌ఐఆర్‌" రూపొందించారని తెలిపారు.
 

నలుగురు బాధితులను నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు మనుషులు నిర్బంధించి పూర్తి వివరాలు తీసుకున్నారని, ఈ ఎంపీతో మహిళలకు ఉన్న అక్రమ శృంగార సంబంధాల గురించి చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారని తెలిపారు. వివిధ పార్టీలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్‌ జోక్యం చేసుకొని బాధితులను ఎంపీ బారి నుంచి, పోలీసుల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. నేటి అమాయకుల హననంలో నేడు అధికారం చేజిక్కించుకున్న నిన్నటి అమాయకుడు వారిపై కరాళ నృత్యం చేస్తున్నాడని జన ఘోష. 

telangana-news-peddapalli-mp-balka-suman-sexual-ha

telangana-news-peddapalli-mp-balka-suman-sexual-ha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
About the author