చంద్రబాబు నాయుడు లెక్కల మనిషి. క్రమశిక్షణ విషయంలో ఆయన అస్సలు రాజీపడడు. అందుకే పార్ట్ నాయకులు ఎవరూ కూడా ఆయన మాట జవదాటకుండా జాగ్రత్తగా వ్యవహారాలు చేస్తుంటారు. అయితే ఇప్పడు ఎన్నికల హడావుడి మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తుండడంతో పార్టీలో ఉన్న నాయకులంతా తమ గొంతు పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. ఇది ముందే గ్రహించిన బాబు వారికి గట్టిగానే షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా ... ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులు ... బాబు కి పెద్ద సమస్యగా తయారయ్యారు. 


ప్రధానంగా వైసీపీ ని బలహీనం చేసేలా అప్పట్లో వలసలను బాగా ప్రోత్సహించాడు బాబు . దానికి ప్రతిఫలంగా ... ఒక్కో ఎమ్మెల్యేకూ సుమారు నలభై కోట్ల రూపాయల వరకూ ముట్టచెప్పినట్టు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. అయితే అలా ఎమ్మెల్యేలను తెచ్చేసుకుంటే వైసీపీ బలహీనం అవుతుందని బాబు భావిస్తే...  ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి తలపోటుగా మారారు. ఇష్టమొచ్చినట్టు వారు ప్రకటనలు ఇస్తూ.. క్రమశిక్షణ తప్పడమే కాకుండా కొత్త కొత్త తలపోట్లు తీసుకొస్తున్నారు.  


అదీకాకుండా ఇప్పుడు వారితో కొత్త చుక్కులు వచ్చిపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరికి టికెట్ల కేటయింపు ఎలా చేయాలా అని బాబు ఆలోచనలో పడ్డాడు. ఫిరాయింపుదార్లు ఒకవైపు, పాత అభ్యర్థులు ఒకవైపు వీరి మధ్యన చంద్రబాబు నాయుడు టికెట్ల కేటాయింపు విషయంలో చాలా తలనొప్పినే భరించాల్సి ఉంది. వాళ్లకు టికెట్ ఇస్తే వీరికి కోపం, వీళ్లకు టికెట్ ఇస్తే వాళ్లకు కోపం.. ఇలాంటి నేపథ్యంలో జరుపుతున్న సమావేశాల్లో  బాబు చేసేది ఏమీ లేక వారిపై బెదిరింపులకు దిగుతున్నాడు. ఇదొక్కటే సరైన పరిష్కారం అని ఆయన నమ్ముతున్నాడు. 


టికెట్ల విషయంలో ఎక్కువగా నోరుపారేసుకుంటున్న వారిని గుర్తించి వారిని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణగా ఉండండి లేకపోతే నా తడాఖా చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్టు  తెలుస్తోంది. మీ ఆర్థిక వ్యవహారాలపై విచారణలు చేయిస్తానని, మీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిస్తానని బాబు పరోక్షంగా బెదిరిస్తుండడంతో వారిలో ఆందోళన మొదలయ్యింది. బాబు దగ్గర కుప్పిగంతులు వేయాలంటే అది కుదిరేపని కాదని వారు తెలుసుకుంటే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: